39.2 C
Hyderabad
May 3, 2024 11: 26 AM
Slider నల్గొండ

కార్మిక చట్ట సవరణలను విరమించుకోకపోతే ఉద్యమం ఉధృతం

#Building workers

తెలంగాణ శిల్ప కళ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు గోవిందు అధ్యక్షతన గురువారం జిల్లా సదస్సు  జరిగింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వర్తక సంఘం కార్యాలయంలో తెలంగాణ శిల్ప కళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్మిక చట్ట సవరణ చేసి, అందమైన భవనాలు, బహుళ అంతస్తులు నిర్మించే భవన, ఇతర నిర్మాణ కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టి వేసిందని అన్నారు.

దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న 1996 భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ,వెల్ఫేర్ బోర్డు నిబంధనల్ని యజమానులకు అనుకూలంగా మార్చుతూ, వెల్ఫేర్ బోర్డు నిధులను కేంద్ర ప్రభుత్వం కాజేయాలని చూస్తుందని, కార్మికులకు ఉపయోగపడని చట్ట సవరణ విరమించుకోవాలని, విరమించకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు, శీతల రోషపతి, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి ఎస్.రామ్మోహన్, జిల్లా అధ్యక్షుడు రావులపెంట వెంకయ్య, ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, జిల్లా నాయకులు బాలాజీనాయక్, శేఖర్‌, రవీందర్, గోవింద్, ముస్తఫా, వినాయకరావు,వీరబాబు, షేక్ సైదా, నజీర్, గణేష్, గోపి, సాయమ్మ,వీరమ్మ, నాగమణి, ఉమా, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాట్రగడ్డ ప్రసూనతో టిడిపి అధ్యక్షుడు నరసింహులు భేటీ

Satyam NEWS

హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలి

Satyam NEWS

కరోనా వ్యాప్తి అరికట్టడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలం

Satyam NEWS

Leave a Comment