23.2 C
Hyderabad
May 7, 2024 21: 20 PM
Slider ముఖ్యంశాలు

హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలి

#seetakka

మేడారం నుండి రేపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టే హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి పిలుపునిచ్చారు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మల్లు రవి  గారు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ రేపటి నుండి జిల్లాలోని మేడారం నుండి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టనున్నారు.

ఈ యాత్రలో ఇంటింటికీ వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అన్నీ వర్గాలకు జరిగిన లబ్ధి గురించి వివరించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించి, రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి సాధనకై కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టాలన్నారు.

రేపటి యాత్ర షెడ్యూల్

ఉదయం 11 గంటలకు ములుగు గట్టమ్మ దేవయలం లో పూజలు 11:30 గంటలకు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం  శ్రీ మేడారం సమ్మక్క- సారలమ్మ ప్రాంగణానికి చేరుకొని అమ్మవార్లను దర్శించుకులోని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేడారం నుండి యాత్ర మొదలై  ప్రాజెక్టునగర్ గ్రామానికి చేరుకుంటుంది

అక్కడ భోజన విరామం అనంతరం మధ్యాహ్నం  యాత్ర మొదలై సాయంత్రం 4:30 గంటలకి పస్రా గ్రామం చేరుకుంటుంది. పస్రా గ్రామ సెంటర్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించి, అక్కడినుండి గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్ గ్రామాల మీదుగా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ మీదుగా పాలంపేట గ్రామానికి చేరుకుంటుంది.

రాత్రి అక్కడే బస చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు,కార్మికులు కర్షకులు మహిళలు మేదావులు కవులు కళాకారులు యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నామని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి,మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్,మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు సోషల్ మీడియా ఇంఛార్జి చమల కిరణ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్,టీపీసీసీ సభ్యులు మల్లాడి రాం రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజూ సూర్య నారాయణ,

మాజీ సహకార సంఘం చైర్మన్ వేముల సమ్మి రెడ్డి,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యామ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,ఎంపీటీసీ మవూరపు తిరుపతి రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు, కోంగరి నరేందర్ ప్రభు,తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిందూరం సినిమా కోసం మొదటిసారి నక్సలైట్ పాత్రలో నటించా

Bhavani

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగించండి

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Bhavani

Leave a Comment