37.2 C
Hyderabad
May 2, 2024 11: 58 AM
Slider వరంగల్

రైతు మిత్ర ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

#PaddyProcrurmentCenter

దేశానికి వెన్నుముక అయిన రైతు కు అండగా పని చేస్తున్న ప్రభుత్వం  తెలంగాణ ప్రభుత్వం అని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. ఈరోజు ములుగు జిల్లా లోని బండారుపల్లి గ్రామంలో రైతు మిత్ర  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కోసం పథకాలను తీసుకొస్తున్న ఘనత కెసిఆర్ దే  అని కొనియాడారు. తెలంగాణ రైతుల కోసం సన్న బియ్యం మద్దతు ధర, కేంద్రం ప్రవేశపెట్టిన  మోటార్ విద్యుత్ బిల్లును తిరస్కరించి ప్రజల పక్షాన నిలిచారని ఆమె అన్నారు.

రైతులందరూ ఒకే వేదికపై ఉండాలని సంకల్పంతో రైతు వేదికను ప్రారంభించారని, ప్రతి రైతు కి రైతుబంధు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో లో రైతు సమన్వయ సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, ములుగు జడ్పిటిసి సకినాల భవాని, జడ్పి కోఆప్షన్ మేంబర్ రియాజ్ మిర్జా, రైతు సమన్వయ సమితి ములుగు మండల అధ్యక్షుడు కుటుంబరావు,రైతు మిత్ర అధ్యక్షులు వెంకన్న,ఎంపీటీసీ సుజాత రాజు, సర్పంచ్ రఘు తం,టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్, రైతులు,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

TRSKV ఆధ్వర్యంలో CM KCR కు క్షీరాభిషేకం

Satyam NEWS

కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

Satyam NEWS

యాక్షన్ ప్లాన్: నిమ్స్ లో కరోనా వార్డు ఎలావుంది?

Satyam NEWS

Leave a Comment