40.2 C
Hyderabad
April 29, 2024 15: 52 PM
Slider నల్గొండ

మృతి చెందిన కార్మికురాలికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నివాళి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం సభ్యురాలు కుంచపు పద్మ అకాల మృతి చెందడంతో ఆ సంఘం నాయకులు సందర్శించి పార్థివదేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంఘం ద్వారా 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ నిర్మాణరంగంలో పని చేస్తూనే సంఘ అభివృద్ధికి తోడ్పడిన పద్మ అకాల మరణం చెందడం బాధాకరమని సంఘానికి తీరని లోటని,వెల్ఫేర్ బోర్డు నుండి వారి కుటుంబానికి చెందాల్సిన సంక్షేమ నిధిని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు.జిల్లాలో కార్మిక శాఖ అధికారులు భవన,ఇతర నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని,పెండింగ్ క్లెములను పరిష్కరించకుండా కార్మికులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, తక్షణమే పెండింగ్ క్లెయిమ్ లను పరిష్కరించాలని,రాజకీయ నాయకుల అండతో దళారులు జిల్లా కార్యాలయాలపై విచ్చలవిడిగా అనర్హులను వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేయించి తద్వారా సంక్షేమ పథకాలను ఇప్పించి పబ్బం గడుపుకుంటున్నారని,దీనివల్ల అర్హులైన కార్మికులకు అన్యాయం జరుగుతుందని, తక్షణమే బోగస్ కార్డులను,క్లేములను తొలగించి వారిపై చర్యలు తీసుకొనుటకు ఉన్నత అధికారులు దృష్టి సారించాలని కోరారు.

ప్రభుత్వం మోటార్ సైకిల్ ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ రాష్ట్రంలో నిర్మాణరంగ కార్మికులను పూర్తిస్థాయిలో గుర్తించలేదని, తక్షణమే ప్రతి కార్మికులను గుర్తించి వెల్ఫేర్ బోర్డు కార్డు ఇవ్వాలని,కార్డు పొందిన ప్రతి కార్మికునికి మోటార్ సైకిల్ మంజూరు చేయాలని యల్క సోమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఉపతల వెంకన్న,కోశాధికారి ఉప్పతల నరేష్, ఉపాధ్యక్షుడు పల్లపు రామకృష్ణ,ఉప్పతల గోవిందు,రామకృష్ణ, సాయి,మధు,కాశయ్య,నాగేంద్రబాబు, ప్రభాకర్,వెంకటేశ్వర్లు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

దళితులపై బహిష్కరణ వేటు వేసిన కుల పెద్దలు

Satyam NEWS

చైనా గ్రీన్‌సిగ్న‌ల్‌: ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు పిల్ల‌ల‌ను క‌నొచ్చు

Satyam NEWS

ఆర్మీ జవాన్ కి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిని మింగేశారు

Bhavani

Leave a Comment