42.2 C
Hyderabad
April 26, 2024 17: 47 PM
Slider నిజామాబాద్

దళితులపై బహిష్కరణ వేటు వేసిన కుల పెద్దలు

#kamareddy dist

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా దళితులపై దాడులు చేయడం, కుల బహిష్కరణ చేయడం సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి ఆర్ భూమయ్య మాదిగ అన్నారు.

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దుసుగం గ్రామంలో 70 దళిత కుటుంబాలను బహిష్కరణ చేశారని ఆయన అన్నారు. డప్పులు కొట్టేందుకు రూ.500 పెంచమని అడిగినందుకు గ్రామ సర్పంచ్ బి జె పీ శివారెడ్డి 70 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారని ఆయన అన్నారు. ఉపాధి హామీలో పని చేస్తున్న సాయిలు, లక్ష్మీ, తోట గంగారం లాంటి వారిని పని నుంచి తీసివేశారని ఆయన అన్నారు. ఉపాధి హామీ పనులకు పిలవకుండా వేధిస్తున్నారని ఆయన అన్నారు.

సర్పంచ్ పై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి ఆర్ భూమయ్య అంజయ్య రవి లింగయ్య మారుతి దాసు కార్యకర్తలు పాల్గొన్నారు.

జి. లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

న‌వంబ‌రు 29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

Sub Editor

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

బలవంతపు వసూలు చేస్తున్న తై బజార్ గుత్తేదారులు

Satyam NEWS

Leave a Comment