37.2 C
Hyderabad
April 26, 2024 22: 00 PM
Slider విజయనగరం

హైయ‌ర్ క‌ని కారు తీసుకెళ్లాడు…త‌ర్వాత ఫోన్ స్విచ్చాఫ్

#CarThief

ఏదైనా ప్ర‌త్య‌క్షంగా క‌ళ్ల‌తో చూస్తే గాని నమ్మ‌లేని రోజులివి. ఓ కారును అద్దెకంటూ తీసుకెళ్లి…నాలుగు రోజుల త‌ర్వాత కారును తీసుకెళ్లిన వ్య‌క్తి ఫోన్  నెంబ‌ర్ స్విచ్చాఫ్ రావ‌డంతో..దొంగ‌త‌నం భండారం వెలుగులోకి వచ్చింది.

అస్స‌లు కారును ఇలా కూడా థెఫ్ట్ చేయ‌వ‌చ్చా అని  నిందితుడ్ని ప‌ట్టుకుంటేగాని పోలీసుల‌కు అర్దం కాలేదు. త‌న కారును అద్దెకు ఇచ్చిన య‌జ‌మాని ఇచ్చిన ఫిర్యాదు తో దర్యాప్తు చేపట్టిన విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలో  డీఎస్పీ అనిల్  ఆధ్వ‌ర్యంలో రూర‌ల్ సీఐ మంగ‌వేణి, ఎస్ఐ నారాయ‌ణ‌..ఐడీ పార్టీ సిబ్బంది దాదాపు నాలుగు రోజుల పాటు నిశితంగా కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

హైవేల మ‌ధ్య‌లో ఉన్న సీసీ కెమారాల‌ను ప‌రిశీలించిన పోలీసులు..అన్న‌వరం వ‌ర‌కు వెళ్లినట్టుగా సీసీ కెమారాల‌లో క‌నిపించింది. ఆ త‌ర్వాత సీసీ కెమారాల పుటేజ్ ను ప‌రిశీలించిన కారు జాడ క‌నిపించ లేదు.

వెంట‌నే అన్నవ‌రం పోలీసుల‌ను సంప్రదించి…ap39v 6467 నెంబ‌ర్ గ‌ల కారు  అన్న‌వ‌రంలోనే ఓ లాడ్దిలో ఉన్న‌ట్టు గుర్తించి హోట‌ల్ ను నిర్వాహ‌కుల‌ను విచారించ‌డంతో….నిందితుడు వినోద్ కుమార్ బండారం బ‌య‌ట ప‌డింది.

 ఎట్ట‌కేల‌కు…3 ల‌క్ష‌ల 90 వేలు విలువ చేసే  స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు స్వాధీనం ప‌ర‌చుకున్నారు.కేసును న‌మోదు చేసుకుని ద‌ర్యాప్త చేప‌ట్టిన విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసారు.ఈ మీడియా సమావేశంలో రూర‌ల్ సీఐ మంగ‌వేణి, ఎస్ఐ నారాయ‌ణ‌రావు, ఏఎస్ఐ త్రినాథ‌రావు,పీసీ ఎస్.కే. ష‌ఫీలు పాల్గొన్నారు.

Related posts

హామీలను వెంటనే పరిష్కరించాలి

Murali Krishna

[Over-The-Counter] – Male Enhancement Vitamins At Walmart Enzyme Male Enhancement Commercial Nite Rider Natural Male Enhancement

Bhavani

ప్రధాని నరేంద్ర మోడీ కి మెహం చాటేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment