38.2 C
Hyderabad
April 29, 2024 14: 41 PM
Slider ముఖ్యంశాలు

సి-డాక్ తో సిబిఐటి అవగాహన ఒప్పందం

#CBIT MoU

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి) ఈ రోజు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక ప్రధాన ఆర్ డి సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.

ఈ అవగాహన ఒప్పందం ద్వారా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, గ్రిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ , బహుభాషా కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీస్ వంటి అత్యాధునిక, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో కలిసి పనిచేయడానికి రెండు సంస్థలు అంగీకరించాయి.

కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా సిబిఐటి కి నేషనల్ ఇనిషియేటివ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్‌లో భాగమయ్యే అవకాశం కలిగింది నాస్కామ్ “ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్” ప్లాట్‌ఫారమ్‌లో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధి కోసం వివిధ కోర్సులపైన శిక్షణ ఇస్తుంది అని అన్నారు.

ఎంఓయుపై ప్రిన్సిపాల్, సిబిఐటి ప్రొఫెసర్ పి. రవీందర్ రెడ్డి, హైదరాబాద్ డైరెక్టర్ ఫై ఆర్ లక్ష్మీ ఈశ్వరి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ సి-డాక్ హైదరాబాద్ గ్రంధి జ్యోత్స్న , డైరెక్టర్ ఐ మరియు ఐ ప్రొఫెసర్ యు కె చౌదరి, సిఎస్ఈ విభాగం అధిపతి ప్రొఫెసర్ వై రమా దేవి, ప్రొఫెసర్ కె రాధికా, ప్రొఫెసర్ డి. రామన్, డాక్టర్ జి.ఎన్.ఆర్. ప్రసాద్, డాక్టర్ సంగీత గుప్తా, ఎస్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆటోడ్రైవర్ కూతురికి విమానం నడిపించే అవకాశం

Satyam NEWS

బాధిత కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ పంపిణీ

Satyam NEWS

శివసేన వివాదంపై రేపు సుప్రీం విచారణ

Satyam NEWS

Leave a Comment