39.2 C
Hyderabad
April 30, 2024 20: 39 PM
Slider ప్రత్యేకం

సిబిఐటి మెకానికల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

#cbit

సిబిఐటి మెకానికల్ విద్యార్థులు యాదాద్రి – భువనగిరి లోని వియాష్ లైఫ్ సైన్స్ ను సందర్శించారు. మొదటగా విద్యార్థులు ముడి పదార్థాలు, నిల్వ, వేర్‌హౌస్ యూనిట్‌ను సందర్శించారు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక నిర్వహణ పద్ధతులను ఎలా నిల్వ చేస్తున్నారో, ఎలా నిర్వహించాలో తెలుసుకున్నారు. వియాష్ ప్రధాన  ఉత్పత్తులైన వివిధ ఔషధాలు ప్రీగాబాలిన్, ఐరన్ సార్బిటాల్, హైడ్రోక్లోరైడ్, డిస్ప్రిన్, సెరాక్సన్ మరియు బెటాహిస్టిన్ గురించి తెలుసుకున్నారు.

వియాష్ ప్లాంట్ హెడ్ రాజేంద్ర కుమార్, ప్లాంట్ ఈహెచ్ఎస్  హెడ్ శాంసన్, నరేంద్ర, నర్సింగరావు విద్యార్థులకు భద్రత, నిర్వహణ అంశాలను వివరించారు. ప్లాంట్‌కు ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాల కోసం ఉపయోగించే ఫిఫా (ఫస్ట్ ఇన్-ఫస్ట్ అవుట్) మోడల్‌ను వారు వివరించారు. అలాగే, వారు స్టోరేజీ, డిస్పెన్స్ రూమ్‌లో ఉపయోగించే స్పిల్ కంట్రోల్, లీక్ మరియు స్మోక్ డిటెన్షన్ సెన్సార్‌ల పనితీరును చూపించారు.

అనంతరం స్టోరేజీ యార్డులో వివిధ అంశాలకు ఉపయోగించే వివిధ రంగుల కోడ్‌లను విద్యార్థులు పరిశీలించారు. దీని తర్వాత వారు తయారీ ప్రాంతం-1ని సందర్శించి, వివిధ రియాక్టర్ల పనితీరును గమనించారు. సమతుల్య  పిహెచ్  రసాయనాలకు ఉపయోగించే స్టెయిన్‌లెస్ స్టీల్ రియాక్టర్, తక్కువ మరియు ఇతర పిహెచ్ వేల్స్ కోసం గాజుతో కప్పబడిన రియాక్టర్లు, వడపోత కోసం ఉపయోగించే సెంట్రిఫ్యూజ్ పద్ధతులు, ఆవిరి ఉత్పత్తికి ఉపయోగించే బాయిలర్లు సందర్శించారు.

విద్యార్థులు పంప్ హౌస్‌ను సందర్శించి, వివిధ రకాలైన జాకీ (ఆటో స్టాప్), ఎలక్ట్రికల్ (మాన్యువల్) మరియు డీజిల్ పంపులు మొదలైన వాటిని పరిశీలించిన తర్వాత, ప్రథమ చికిత్స గదిని సందర్శించి, ఉపయోగించిన ప్రథమ చికిత్స విధానాన్ని అర్థం చేసుకున్నారు. తర్వాత అంబులెన్స్, ఫైర్ ఇంజన్, అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలో దాని పని ప్రదర్శన చూశారు. చివరగా, విద్యార్థులు అండర్ గ్రౌండ్ కెమికల్ స్టోరేజీ యూనిట్‌ను సందర్శించారు.

ఈ పర్యటన ద్వారా విద్యార్థులు వివిధ యంత్రాల పనితీరు, ఉత్పత్తులు ,  భద్రత మరియు నిర్వహణ గురించి కూడా తెలుసుకొన్నారు అని ఈ  సందర్శన కన్వీనర్  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్ కిరణ్ కుమార్ అమిరెడ్డి, నవనీత, కోటేశ్వర్ రావు తెలిపారు. పారిశ్రామిక సందర్శనకు డాక్టర్ బివిఎస్ రావు మరియు డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ పి.ప్రభాకర్ రెడ్డి  సమన్వయ కర్తగా వున్నారు.

Related posts

(2022) How Does Benicar Lower Blood Pressure 10 Home Remedies For High Blood Pressure

Bhavani

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల కుంభకోణం

Satyam NEWS

రుణమాఫీ చేసినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

Leave a Comment