38.2 C
Hyderabad
April 27, 2024 16: 32 PM
Slider హైదరాబాద్

12వ స్టోర్‌ను ప్రారంభించిన సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ

#srilata

ఏ ఎస్‌ రావు నగర్‌ వద్ద నటి శ్రీ లీల చేతుల మీదుగా ప్రారంభం

దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆభరణాల వ్యాపారంలో అత్యంత సుప్రసిద్ధమైన సంస్ధలలో ఒకటిగా ఖ్యాతి గడించిన సంస్ధ సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ. సత్తిబాబు నేతృత్వంలో ఈ సంస్ధ ఆభరణాల విభాగంలో ప్రవేశించింది. సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ హైదరాబాద్‌లో తమ 12వ స్టోర్‌ను ఏ ఎస్‌ రావు నగర్‌లో ఏర్పాటుచేసింది.  సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేయగా,  ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, ఏ ఎస్‌ రావు నగర్‌ కార్పోరేటర్‌ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ స్టోర్‌ను ప్రారంభించారు. సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ తమ మొదటి స్టోర్‌ను మల్కాజ్‌గిరి వద్ద ప్రారంభించింది. ఈ స్టోర్‌లో విస్తృత శ్రేణిలో వజ్రాలు, బంగారం, సొలిటైర్స్‌ను ప్రదర్శిస్తారు. ఈ ఆభరణాలలో  సంప్రదాయ మొదలు ఆధునిక ఆభరణాల వరకూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రాంతాల వారీ ఆభరణాలు ఇక్కడ ప్రత్యేకంగా లభ్యమవుతాయి. ఈ స్టోర్‌లో విస్తృత శ్రేణిలో డిజైనర్‌ డైమండ్‌ బ్రైడల్‌ జ్యువెలరీ లభ్యమవుతుంది.

ఈ స్టోర్‌ను ప్రారంభించిన అనంతరం నటి శ్రీలీల మాట్లాడుతూ ‘‘కాలాతీత డిజైన్లకు సుప్రసిద్ధమైనది సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ. బంగారం ఆభరణాలను హెచ్‌యుఐడీ,  వజ్రాలను ఐజీఎస్‌ సర్టిఫికెట్‌తో అందిస్తారు. ఇక్కడ ఆభరణాలు కేవలం ఆభరణాలు  మాత్రమే కాదు అవి విలువైన ఆస్తులు మరియు ఎన్నో కుటుంబాలలో అంతర్లీనంగా దాగిన భావోద్వేగాల ప్రతీకలు.  ఒక తరం నుంచి మరో తరానికి వీరి ఆభరణాలు వెళ్తూనే ఉంటాయి. ప్రతి ఆభరణాన్నీ అనుభవజ్ఞులైన, చక్కటి పనితనం కలిగిన స్వర్ణకారులు తీర్చిదిద్దారు. ఇవి సీఎంఆర్‌ పనితనం, విలువ, వినూత్నమైన డిజైన్‌ సున్నితత్త్వపు హామీతో వస్తాయి’’ అని అన్నారు.

సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ ఛైర్మన్‌ –మేనేజింగ్‌ డైరెక్టర్‌ సత్తిబాబు మాట్లాడుతూ ‘‘ ఏఎస్‌ రావు నగర్‌ వద్ద సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలలో  ఇది ఒకటి. మా వినియోగదారులలో అధిక శాతం మంది ఈ ప్రాంతంలో మా స్టోర్‌ను ప్రారంభించమని కోరడం వల్ల ఇక్కడకు వచ్చాము. ఏఎస్‌ రావు నగర్‌ చుట్టుపక్కల  ప్రాంతాల్లోని ఆభరణాల ప్రేమికులు  మా నూతన డిజైన్‌లను సొంతం చేసుకుంటూనే పాత ఆభరణాలను కొత్తవాటితో మార్చుకోనూ వచ్చు.

ఈ నూతన స్టోర్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరికీ అద్వితీయమైన అనుభూతులను అందించగలమనే వాగ్ధానం చేస్తున్నాము. హైదరాబాద్‌లో  మా సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీ స్టోర్లను మరిన్ని ప్రారంభించనున్నాము. వ్యక్తిగతీకరించిన షాపింగ్‌ అనుభవాలను సొంతం చేసుకునేందుకు సీఎంఆర్‌ లెగసీ ఆఫ్‌ జ్యువెలరీని సందర్శించండి’’ అని అన్నారు.

స్టోర్‌ ప్రారంభోత్సవంతో పాటుగా రాబోతున్న అక్షయ తృతీయ పండుగను పురస్కరించుకుని బంగారం ఆభరణాల మజూరీపై 50% వరకూ తగ్గింపును, వజ్రాభరణాలపై కెరట్‌కు 20వేల రూపాయల తగ్గింపును, వజ్రాభరణాల మజూరీ చార్జీలపై ఫ్లాట్‌ 50% రాయితీ అందిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు.  అలాగే వెండి వస్తువులపై తరుగు, మజూరీ చార్జీలు పూర్తిగా మినహాయించామని,  మునుపెన్నడూ చూడని కలెక్షన్స్‌ను , వేరెవ్వరూ ఇవ్వలేని ధరలకు అందిస్తున్నామన్నారు.

For more information, please contact: KALYAN CHAKRAVARTHY @ 9381340098

Related posts

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో యువతకు అవకాశం

Satyam NEWS

ప్రధాని టూర్ పై అతిగా స్పందన : చన్నీ

Sub Editor

వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లతో రైతుల దాడి

Satyam NEWS

Leave a Comment