29.7 C
Hyderabad
May 1, 2024 08: 11 AM
Slider రంగారెడ్డి

కుషాయిగూడ అగ్ని ప్రమాదంపై హోం మంత్రి దిగ్భ్రాంతి

#homeminister

కుషాయిగూడ టింబర్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలోఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం పట్ల   హోం మంత్రి మహమ్మద్ అలీ, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు స్పష్టం చేశారు.

కాప్రా సర్కిల్ కుషాయిగూడ సాయి నగర్ లోని టింబర్ డిపోలో ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు షాక్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని హోం మంత్రి మహమ్మద్ అలీ, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి,  మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి లతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి చేరుకుని అనంతరం ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

టింబర్ డిపోలో ఒకసారి గా ఎగిసిపడిన అగ్నికీలలు దట్టమైన పొగతో పక్క బిల్డింగ్ లో నిద్రలో ఉన్న కుటుంబాలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు లోనై రక్షించండి అంటూ హహాకారాలు చేస్తూ ప్రాణ భయంతో పరుగులు చేయడం జరిగిందని స్థానికులు వివరించారు. ఇదే క్రమంలో బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెంది స్థానిక హెచ్పి గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నరేష్ 35 సుమ 32 అతని ఆరేళ్ల వయసు కూతురు సుదేష్ అనుభయంతో పరుగులు తీస్తూ భవనం మొదటి అంత చేరుకొని పొగ మంటల దాటికి తట్టుకోలేక మెట్ల పైన కుప్పకూలి ప్రాణాలు వదిలిన విషయం తెలుసుకొని చలించిపోయారు.

ప్రమాద స్థలాన్ని సందర్శించిన వారిలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి, గంధం నాగేశ్వరరావు, జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సి సీ ఎస్ ప్రతినిధులు నాయకులు సారా వినోద్ ముదిరాజ్, ఎంపల్లి పద్మా రెడ్డి, సారా అనిల్ ముదిరాజ్, కాసం మైపాల్ రెడ్డి, గంప కృష్ణ, రాకేష్ తదితరులున్నారు.

సత్యంన్యూస్ మేడ్చల్ జిల్లా

Related posts

వచ్చే ఏడాది యూపీ ఎన్నికలకు అధికార బీజేపీ సమాయత్తం

Sub Editor

జీ 7 సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న మోడీ

Satyam NEWS

నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు తక్షణమే చేరాలి

Satyam NEWS

Leave a Comment