40.2 C
Hyderabad
April 29, 2024 17: 18 PM
Slider రంగారెడ్డి

విద్యార్థులు అక్షయ పాత్ర ఫౌండేషన్ సందర్శన

#cbit

సిబిఐటి కళాశాలలో  స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఎమ్ బిఎ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న  విద్యార్థులు   సామాజిక కార్యకలాపాలు అభివృధి లో భాగం గా ఈ రోజు  నార్సింగిలోని “అక్షయ పాత్ర ఫౌండేషన్”ని సందర్శించారు.  వంటశాల , లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఆహార తయారీ మరియు పంపిణీ ప్రక్రియను అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి  రాకేష్ కుమార్ మిశ్రా వివరించారు. 

ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ అక్షయ పాత్ర ఫౌండేషన్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక లాభాపేక్షలేని సంస్థ. ఇది భారతదేశంలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండి, దానిని నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని పాఠశాలలకు అందజేస్తుంది. ఇది 2000 సంవత్ర్సంలో ప్రారంభించబడింది. పిల్లలు ఆకలితో చదువుకు దూరమవకుండా నిరోధించడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం  అని తెలిపారు. విద్యార్థులు “మైండ్ పవర్ మేనేజ్‌మెంట్”పై వర్క్‌షాప్‌కు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తులసీ రామ్, వి.బాలాజీ కేశవ రావు సమన్వయం చేసారు.

Related posts

నీట్‌, జేఈఈ సాధనకు ‘కోటా’ స్టడీ మెటీరియల్‌ సిద్ధం

Satyam NEWS

కరోనా హెల్ప్:నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం

Satyam NEWS

పంట నష్టం జరగొద్దు

Murali Krishna

Leave a Comment