29.7 C
Hyderabad
May 1, 2024 04: 30 AM
Slider మహబూబ్ నగర్

ప్రతి చోటా సీసీ కెమెరాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలి

#kollapurpolice

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండేలా, ఉన్న కెమెరాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ  K.మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. నేడు ఆయన పెద్ద కొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ పోలీస్ స్టేషన్, కొల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ లు, సర్కిల్ ఆఫీస్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి శుభ్రంగా ఉంచాలని సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సీసీ కెమెరాలను, రికార్డులను పరిశీలించారు. వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.  సిబ్బంది వర్టికల్ డ్యూటీ, కేటాయించిన వారి విధుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వారు చేయవలసిన విధులను సక్రమంగా పాటించాలని, విలేజ్ పోలీసింగ్ సిస్టమ్ అమలు చేయాలని, ప్రజల్లో కరోనా గురించి అవగాహన కలిగించాలని ఎస్పీ ఆదేశించారు. సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో, పట్టణాలలోని వార్డులలో, ముఖ్యమైన కూడళ్ళలో ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ప్రజలలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేయాలని, ప్రతి గ్రామంలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు తెలుసుకుని సమాచారాన్ని అధికారులకు తెలియపరచాలని సూచించారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

మాతృభూమి కోసం NRI TDP సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలి

Bhavani

సమాజానికి హక్కులతో బాటు బాధ్యతలు ఉండాలి

Satyam NEWS

కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవేరులతో దర్శనమిచ్చిన శ్రీ వేణుగోపాల స్వామి

Satyam NEWS

Leave a Comment