29.7 C
Hyderabad
May 6, 2024 04: 39 AM
Slider మహబూబ్ నగర్

గణేష్ జిన్నింగ్ మిల్లులో సి సి ఐ పత్తి దగ్ధం

#Fire Accident

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామ సమీపంలో ఉన్న  గణేష్ జిన్నింగ్ మిల్లులో సి సి ఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తిని పో క్లేనర్ వంటి వాహనంతో ఒకే దగ్గరకు తరలిస్తుండగా వాహనానికి ఉన్న ఇనుప బకెట్ జిన్నింగ్ మిల్ కాంపౌండ్ లోని సిసి రోడ్డుకు రాపిడి జరిగి నిప్పురవ్వలు రాజేసుకుని ఒక్కసారిగా మంట రావడంతో  మిల్లులో ఉన్న పత్తి మొత్తం దగ్దం అయింది.

సిసిఐ కొనుగోలు చేసిన పత్తి దాదాపుగా 22వేల నుండి 25 వేల క్వింటాళ్ల వరకు ఉంటుందని, 12 కోట్ల నుండి  15 కోట్ల రూపాయల విలువగల పత్తి అగ్నికి ఆహుతి అయిన ట్లు సిసిఐ పత్తి కొనుగోలు నిర్వాహకులు వరుణ్ రెడ్డి తెలిపారు. గణేష్ జిన్నింగ్ మిల్లులో మంటలు వస్తున్నాయన్న సమాచారంతో కల్వకుర్తి సబ్ డివిజన్ అధికారి గిరిబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మంటలను ఆర్పేందుకు కల్వకుర్తి ఫైర్ స్టేషన్ సిబ్బంది తో పాటు నల్లగొండ జిల్లా దేవరకొండ ఫైర్  స్టేషన్ వాహనాలు తరలివచ్చాయి డీఎస్పీ తో పాటు కల్వకుర్తి వెల్దండ సిఐలు సైదులు నాగరాజు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎస్సైలు మహేందర్ బాలకృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ హరిందర్ రెడ్డి. శశిధర్ లు ఉన్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వానికి ఆస్తినష్టం

సీసీఐ అధికారుల నిర్లక్ష్యం వల్లే 12 నుండి 15 కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ ఆస్తి దగ్ధం అయిందని పలువురు విమర్శిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో అగ్ని భద్రత చర్యలు తీసుకోకుండానే పత్తిని కొనుగోలు చేశారని పలువురు  బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు నిర్లక్ష్యం వహించిన సిసిఐ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా పట్టణ పరిధిలోని మిగతా జిన్నింగ్ మిల్లులలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సీసీఐ అధికారులు  అగ్ని భద్రత చర్యలు చేపట్టాలని నగర వాసులు సూచిస్తున్నారు.

Related posts

బలహీన వర్గాలు అభివృద్ధి కి ఉద్యమించిన మహాత్మా పూలే

Satyam NEWS

నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయం

Satyam NEWS

స‌మ‌య‌పాల‌న పాటించ‌ని స‌చివాల‌య సెక్ర‌ట‌రీలు….!

Satyam NEWS

Leave a Comment