39.2 C
Hyderabad
April 28, 2024 12: 53 PM
Slider విజయనగరం

స‌మ‌య‌పాల‌న పాటించ‌ని స‌చివాల‌య సెక్ర‌ట‌రీలు….!

#vijayanagaram

మున్సిపాలిటీ పారిశుద్య‌స‌మావేశానికి ఆర‌గంట ఆల‌స్యం..!

సచివాల‌య సెక్ర‌ట‌రీస్ తో పాటు హెల్త్ ఆఫీస‌ర్ కూడాను….!

స‌మావేశంలోనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన క‌మీష‌నర్, ఎమ్మెల్యే…!

చ‌దివారుగా ….ఇదీ జిల్లా కేంద్రంలోని విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ఉద‌యం తొమ్మిదిగంట‌ల‌కు ప్రారంభించాల్సిన స‌మావేశం కాస్త‌..ఆర‌గంట ఆల‌స్యంగా ప్రారంభం అయింది.

ఈ నెల 18,19 న విజ‌య‌న‌గ‌రం శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి  సిరిమానోత్స‌వం  సంబ‌రం జ‌ర‌గున్న నేప‌ధ్యంలో న‌గ‌రంలో పారిశుద్య ప‌నుల‌కు సంబంధించి ఏయే చ‌ర్య‌లు తీసుకోవాలి..! వ‌ర్క‌ర్ల‌తో ఏయే  డివిజ‌న్ ల‌లో ఎంతమంది..? ఎన్నిగంట‌లు చొప్పున ప‌నిని కేటాయించాల‌ని అన్న‌దానిపై స‌మావేశం జ‌ర‌గాల్సిన సంద‌ర్బంలో స‌మ‌యానికి కవ‌లం కొంత‌మందిమాత్ర‌మే  హాజ‌ర‌య్యారు.

అనుకున్న స‌మ‌యం మేర‌కునిర్దేశించిన కాలానికి క‌మీష‌న‌ర్ వ‌ర్మ‌..స‌మావేశం ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఒక్కొ స‌చివాల‌య‌సెక్ర‌ట‌రీ రావ‌డంతోక‌మీష‌న‌ర్ వ‌ర్మ‌..కాస్త ఫైర్ అయ్యారు. కొద్ది సేప‌టికి మేయ‌ర్ విజ‌య‌లక్ష్మీ,ఎమ్మెల్యే  కోల‌గ‌ట్ల,డిప్యూటీ మేయ‌ర్ శ్రావ‌ణిలు రావ‌డంతో స‌మావేశఃం పూర్తి స్థాయిలో ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా  ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ…..రెండేళ్ల‌క్రితం నియ‌మించ‌బ‌డ్డీ  స‌చివాల‌య సెక్ర‌ట‌రీలు…చేస్తున్న ప‌నిని శ్ర‌ద్ద‌గా చేయాల‌ని..యువ‌తీ యువ‌కులైన  మీరు మీ డిజివ‌న్ ను మేప్ ద్వారా ఇప్ప‌టికే ఆవ‌గాహ‌న పెంచుకోవాలన్నారు.

యువ‌తే దేశానికి ప‌ట్టుకొమ్మ అన్న ఉద్దేశ్యంతో సీఎం జ‌గ‌న్…ఈ సచివాల‌య సెక్ర‌ట‌రీల‌ను నియమించిన విష‌యం గుర్తెర‌గాల‌న్నారు.ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పైడిత‌ల్లి ఉత్స‌వాల‌తోపాటు ఈ నెల‌లో  డెంగ్యూ ప్ర‌బ‌ల‌కుండా తీసుకోవ‌ల‌సిన‌జాగ్ర‌త్త‌ల‌ను మీ శాఖ ద్వారా  మీమీ డివిజ‌న్ ప్ర‌జ‌ల‌క్ఉ మీరే తెలియ‌ప‌రిచి ఎడ్యుకేట్ చేయాల‌న్నారు.

అంత‌ముందు మేయ‌ర్  విజ‌య‌లక్ష్మీ మాట్లాడుతూ న‌గరాన్ని సుంద‌రంగా ఉంచాల్సిన బాధ్య‌త సెక్ర‌ట‌రీలదేన‌న్నారు.అనంత‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆవ‌ర‌ణ‌లోనే నాలుగు ఫాగింగ్ మిష‌న్ల‌ను హెల్త్ ఆఫీస‌ర్ వినియోగంలోకి తెచ్చారు.

Related posts

గవర్నర్ పై హైకోర్టుకు ప్రభుత్వం

Murali Krishna

కృష్ణాజిల్లాలో కరోనాతో ఆర్.యం.పి డాక్టర్ మృతి

Satyam NEWS

చింతూరు రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

Satyam NEWS

Leave a Comment