27.7 C
Hyderabad
April 30, 2024 09: 23 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో 9న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

Tirumala_090615

క‌లియుగ వైకుంఠ‌మైన తిరుమల దివ్య క్షేత్రంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్ధాలు ప్రముఖమైనవి.

వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి. ”శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి” ప్రతి ఏటా మకర మాసంలో నిర్వహించడం ఆనవాయితి.

ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినాన్ని ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణానుసారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు.

ఈ తీర్థం వద్ద నివసిస్తూ శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఎవరైనా అజ్ఞానంతో తల్లి దండ్రులను, గురువులను దూషిస్తే కలిగే దోషాన్ని ఈ పుణ్యతీర్థంలో స్నానం చేస్తే  ఆ దోషం నుండి విముక్తి పొంది సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం. ఈ పర్వదినం నాడు ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు పూజా సామగ్రిని తీసుకువెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ముగియనున్నది.

Related posts

నిర్విఘ్నంగా యాదాద్రి అర్చకుడి అన్నప్రసాద వితరణ

Satyam NEWS

ఆర్టీసీ బిల్లు పై సందేహాలు.. సిఎస్ కు గవర్నర్ లేఖ

Bhavani

పండగలా ప్రారంభమైన పాఠ్యపుస్తకాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment