33.7 C
Hyderabad
April 29, 2024 23: 52 PM
Slider ఆదిలాబాద్

గ్రామీణ ప్రాంతాలకు సెల్ ఫోన్  సేవలు విస్తరించాలి

#adilabadmp

మారుమూల గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలకు టెలికమ్యూనికేషన్ సేవలు విస్తరించాలని అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావు సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ లోని జియో ఆఫీస్ లో కంపెనీ మేనేజర్ నితిన్ తో కలిసి ఏజెన్సీ గ్రామాలకు సెల్ఫోన్ సేవలు విస్తరించాలని ఇందుకు పూర్తిగా సహకరిస్తామని ఎంపీ అన్నారు.

అదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్ జైనథ్ బేల మరియు తలమడుగు తాంసి మండలాలతో పాటు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో టెలికమ్యూనికేషన్ సేవలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎంపీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తెచ్చారు.

కేబుల్ వ్యవస్థను మరింత విస్తరించే లా చర్యలు తీసుకుంటామని ఆన్లైన్ సేవలకు అంతరాయం లేకుండా ప్రజలకు టెలికమ్యూనికేషన్ సేవలు త్వరలోనే  విస్తరిస్తామని మేనేజర్ నితిన్ అన్నారు.

అనంతరం ఎంపీ సోయం బాపురావు బిఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశమై ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ గురించి చర్చించి బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తరించాలని సూచించారు. ఎంపీ వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, అడ సర్పంచ్ బన్నీ. ఆదివాసీ సంఘం ప్రతినిధులు సిడం భీమ్రావు పాల్గొన్నారు.

Related posts

Analysis: పల్లెకు పోదాం సాగును చేద్దాం ఛలో ఛలో

Satyam NEWS

ద్వారకా తిరుమల అన్నదాన ట్రస్టుకు భారీ విరాళం

Satyam NEWS

అట్టహాసంగా ప్రారంభమైన “ఓ తండ్రి తీర్పు” చిత్రం

Bhavani

Leave a Comment