40.2 C
Hyderabad
April 29, 2024 17: 15 PM
Slider ఖమ్మం

నవతరానికి స్ఫూర్తిదాత భగత్ సింగ్

bhagat singh is the inspiration for the new age

బ్రిటిష్ సామ్రాజ్య వాధాన్ని గడ గడలాడించి, స్వాతంత్ర్యం కోసం నునుగు మీసాల వయస్సు లో ఉరి కంబాన్ని ముద్దాడిన వేగుచుక్క సర్దార్ భగత్ సింగ్ అని సి‌పి‌ఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వారరావు అన్నారు. భగత్ సింగ్  91 వ వర్ధంతి  సందర్భంగా ఖమ్మం లోని  సీపీఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్ లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పువ్వాడ నాగేశ్వర రావు మాట్లాడుతూ నేటి విద్యార్థి, యువతకు భగత్ సింగ్ పోరాట జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు, అతి చిన్న వయసులో పోరాటాల వైపు ఆకర్షితులై దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన భారతమాత ముద్దుబిడ్డ విప్లవ యువకెరటం భగత్ సింగ్ అని పేర్కొన్నారు,

దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా బ్రతకాలని లౌకికవాదం పరిరక్షించాలని దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం తీసుకురావాలని పోరాటాలు చేసిన భగత్ సింగ్ లాంటి పోరాట యోధుల ఆశయాలకు నీరుగార్చే విధంగా నేటి పాలకులు వ్యవహరించే తీరును తీవ్రంగా ఖండించారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది సంవత్సరాలలో కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెడుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరిస్తూ దేశవ్యాప్తంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా అనేక కార్యకలాపాలు చేయడం స్వాతంత్ర సమరయోధులు యొక్క పోరాటాన్ని వారి యొక్క త్యాగాలను హేళన చేయడమేనని పేర్కొన్నారు, బిజెపి అధికారంలో చేపడితే సంవత్సరానికి యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని దొంగ హామీలతో అధికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి దేశంలోని విద్యార్థి,యువత ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ లాంటి పోరాట స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు,

రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని పేర్కొన్నారు, రాష్ట్రంలో సైతం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయమని అడిగిన పోరాటాలు చేసినా  అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ప్రజాస్వామ్య హక్కులను ఖూనీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. విద్యార్థి, యువతను నమ్మించి మోసపూరితమైన ఎన్నికల హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి భగత్ సింగ్ లాంటి నాయకుల పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువత పోరాటాలకు నడం బిగించాలని అప్పుడే ఇలాంటి నాయకులకు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని పిలుపునిచ్చారు.ఈ  కార్యక్రమంలో AISF AIYF జిల్లా కార్యదర్శులు నానబాల.రామకృష్ణ  ఇటికాల రామకృష్ణ CPI నాయకులు కుమార్  AIYF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దోజు శ్రవణ్ కుమార్.AISF జిల్లా సహాయ కార్యదర్శి జై. ఉపాధ్యక్షులు యువరాజ్ కౌశిక్.AISF జిల్లా నాయకులు ఉపేందర్ సందీప్ పవన్ కళ్యాణ్ శివ నరేష్ గోపి సాగర్  తదితరులు పాల్గొన్నారు

Related posts

వివేక హత్య కేసులో వివరాల వెల్లడి క్రమశిక్షణ ఉల్లంఘనే

Satyam NEWS

అత్యవసరాలకు ఆన్ లైన్ ద్వారా లాక్ డౌన్ పాసులు

Satyam NEWS

భవన నిర్మాణాల్లో వేగం పెంచాలి

Murali Krishna

Leave a Comment