31.7 C
Hyderabad
May 2, 2024 08: 37 AM
Slider విజయనగరం

రెండు ద‌శాబ్దాల పాటు రిమార్క్ రాకుండా ప‌ని చేసిన వారికి స‌ర్టిఫికెట్లు

#VijayanagaramPolice

ఈ ఏడాది చివ‌రి మాసం మ‌రికొద్ది రోజులలో ముగియ‌బోతోంది. ఈ క్ర‌మంలో ఏపీ రాష్ట్ర డీజీపీ బృహ‌త్త‌ర‌మైన కార్య‌చ‌ర‌ణ రూపుదాల్చారు. పోలీస్ శాఖ లో రెండు ద‌శాబ్దాలుగా ఎటువంటి మ‌చ్చ‌, మ‌ర‌క, ఏలాంటి రిమార్క్ లేకుండా ప‌ని చేసే వారిని గుర్తించారు.

గ‌త కొద్ది రోజుల నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పోలీస్ శాఖ‌ల‌ నుంచీ ఇలాంటి స‌మాచారాన్ని సేకరించిన డీజీపీ….స్వ‌యంగా వాళ్లంద‌రికీ రాష్ట్ర పోలీస్ శాఖ త‌రుపున స‌ర్టిఫికెట్లు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌డం ప్రారంభించారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ…డీసీఆర్బీ మీటింగ్ సంద‌ర్బంగా ఆ స‌ర్టిపికెట్ల‌ను ప్ర‌దానం చేసారు.

ఈ మేర‌కు ఉత్కృష్ట, అతి ఉత్కృష్ఠ అవార్డులను ఎస్పీ రాజ‌కుమారీ ప్ర‌దానం చేసారు. పోలీస్ శాఖ‌లో ఇర‌వై ఏళ్లుగా రిమార్క్ లేకుండా ప‌ని చేసి అటు వ్య‌క్తిత్వంగా ఇటు శాఖాప‌రంగా గుర్తింపు తెచ్చుకున్న‌27 మందికి జిల్లా కేంద్రంలోని దండుమార‌మ్మ టెంపుల్ లో స‌ర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేసారు.

దాదాపు రెండు ద‌శాబ్దాలపాటు ఎటువంటి రిమార్కులు లేకుండా సేవ‌లందించిన సిబ్బందికి ఉతృష్ణ,అలాగే..ఇర‌వై అయిదు ఏళ్లు పూర్తి చేసిన వారికి అతి ఉతృష్ట  స‌ర్టిఫికెట్ల‌ను… 2018-19ఏడాదికి గాను కేంద్ర‌ హోంశాఖ ఎంపిక చేసింది. ఎంపిక చేసిన పోలీసు సిబ్బందికి రాష్ట్ర డిజిపి స్వయంగా సంతకం చేసిన స‌ర్టిపికెట్ల‌ను జిల్లా ఎస్పీ ప్రధానం చేసారు.

అతి ఉత్కృష్ట అవార్డు పొందిన వారిలో….

(1) విజయనగరం సిసిఎ ఎస్ఐగా ఐ.రాజారావు

(2) పోలీసు కంట్రోల్ రూం ఎ ఎస్ ఐ  వి. అప్పారావు

(3) క్లూస్ టీం ఎఎస్ఏ ఎస్.వి.రమణరాజు

4) స్పెషల్ బ్రాంచ్ లో ఎఎస్ఏ కె.విక్రమరావు

 (5) భోగాపురం పి ఎస్ సిబ్బంది కె.వి.నర్సింగరావు

(6) ఆండ్ర పిఎస్ లో ఎ ఎస్ ఐ జి. పోలినాయుడు

(7) ఆర్మ్డ్ రిజర్వులో పని చేస్తున్నసిబ్బంది కె.వి.రమణ , ఎం.గోవిందరావు, టి.వి.రాజు లు స‌ర్టిపికెట్ అందుకున్నారు.

ఇక ఉత్కృష్ట పతకం పొందిన వారులో..

(1) పోలీస్ శాఖ‌ లో పిఆర్వోగా పని చేస్తున్న హెచ్ సి పి.వి.ఎస్.ఎస్. కోటేశ్వరరావు

 (2) నెల్లిమర్ల పిఎస్ లో హెచ్ సిగా పని చేస్తున్న కె.సురేష్ బాబు

(3) విజ‌య‌న‌గ‌రం వన్ టౌన్ పిఎస్ లో హెచ్ సిగా పని చేస్తున్న పి.వి. ఆనందరావు

(4) బొబ్బిలి పిఎస్ లో హెచ్ సిగా పని చేస్తున్న వై.మురళీకృష్ణ

(5) విజ‌య‌న‌గ‌రం టూటౌన్ పిఎస్ లో పని చేస్తున్న బి.శ్రీనివాసరావు

(6) సిసిఎస్ లో హెచ్ సిగా పని చేస్తున్న కె. రాజేశ్వరరావు

(7) పాచిపెంటలో హెచ్ సిగా పని చేస్తున్న ఎస్.వరప్రసాదరావు

(8) రామభద్రపురంలో హెచ్ సిగా పని చేస్తున్న సిహెచ్.వెంకట రమణ

(9) క్లూస్ టీంలో హెచ్ సిగా పని చేస్తున్న ఎ.కృష్ణ

(10) నెల్లిమర్ల పిఎస్లో  హెచ్ సిగా పని చేస్తున్న బి. శోభారాణి

 (11) ఆర్మ్డ్ రిజర్వులో హెచ్ గా పని చేస్తున్న ఎ. జగదీశ్వరరావు

(12) ఆర్. సునీల్ కుమార్ (13) కె.శ్రీనివాసరావు (14) కె.దంతేశ్వరరావు (15) టి. ఈశ్వరరావు (16) వై.రవి

(17) కురుపాంలో హెచ్ సిగా పని చేస్తున్న జె.సంగమేశ్వరరావులు ఈ అవార్డుల‌ను అందుకోగా…

 (18) డిసిఆర్ బిలో హెచ్ సిగా పని చేస్తున్న ఇటీవల మృతి చెందిన సిహెచ్.రామకృష్ణ ఉన్నారు.

ఈ అవార్డుల ప్రధానోత్సవంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, ఒఎస్టీ ఎన్.సూర్యచంద్ర రావు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Related posts

స్పందన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలి

Satyam NEWS

అంబటి జగన్ ను వీడి వెళ్లడానికి వెనుక అసలు కథ ఇది

Satyam NEWS

ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన

Satyam NEWS

Leave a Comment