26.7 C
Hyderabad
April 27, 2024 09: 46 AM
Slider క్రీడలు

విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు

#internationalyogaday

శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమంలో యోగా క్రియలు నిర్వహణ

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రతి ఏడాది జూన్ 21..ఇదే తేదీన గురుపరంపర లి ఒకరైన సిధ్ధ సమాజ స్థాపకులు ,అపరవాల్మీక అయిన శ్రీ స్వామి శివానందుల వారు ఇదే రోజు న సమాధి పొందిన రోజు. దీన్ని పురస్కరించుకుని.. ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ మంతటా నిర్వహించుకుంటోంది.

ఈ తరుణంలో నే శ్రీ స్వామి శివానంద పరమహంస శిష్యులైన…శ్రీవారి స్వామి రామానంద యోగ జ్ఞానాశ్రమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ శ్రీ గురూజీ… విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస శ్రీశ్రీశ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో యోగా దినోత్సవం సందర్భంగా చేయాల్సిన క్రియలు… స్వయంగా శిష్యులచే చేసి..చేయించారు.

ఈ సందర్భంగా మూలబంధాలు..వాటితో పాటు క్రియలను శిష్యులకు చేసి చూపించారు. ఈ విధంగా శరీరం లో నాడులను సవ్యంగా పని చేయగలిగితే అలవోకగా.. ప్రాణాయామం ప్రకృయ సులభతరం అవుతుందన్నారు. ఆహార విహారాలను నియంత్రించుకుంటూ..తద్వారా శరీరాన్ని అందులో ఉండే జీవనాడులను క్రమబద్దంగా ఉంచే ఆసనాలు ,క్రియలు చేసిన పక్షంలో ప్రతీ ఒక్కరికీ గురువు ద్వారా పొందిన ప్రాణాయామ విద్యను పొందినట్లైతే…సమస్త రోగాలు నయం అవుతాయని శ్రీ గురూజీ పేర్కొన్నారు.

దాదాపు గంటన్నర కు పైగా క్రియలు చేసి చూపించారు..శ్రీగురూజీ. కామన్నవలస ఆశ్రమంలో… ఈ యోగా దినోత్సవం నుంచీ జులై 13 వ్యాస పౌర్ణమి(గురు పౌర్ణమి) వరకు ఆశ్రమం లో అఖండ ప్రాణాయామం జరుగుతుందని శ్రీగురూజీ తెలిపారు.ఈ యోగా డే కార్యక్రమానికి.. విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, హైదరాబాద్, అనంతరం, గుంటూరు,జిల్లాల నుంచీ పెద్ద ఎత్తున శిష్యులు హాజరయ్యారు.

Related posts

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం సందర్శించిన న్యాయమూర్తులు

Bhavani

భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్  అవార్డు

Satyam NEWS

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment