38.2 C
Hyderabad
May 3, 2024 19: 09 PM
Slider హైదరాబాద్

మంత్రి పువ్వాడ‌కు క‌రోనా పాజిటీవ్‌!

puvvada

తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌కు క‌రోనా సోకింది. సోమ‌వారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా పాజిటీవ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు తాను న‌గ‌రంలోని త‌న నివాసంలో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. త‌న అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని త‌న‌తో ఇటీవ‌ల కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని మంత్రి సూచించారు. త‌న‌కు ఫోన్ చేయ‌వ‌ద్ద‌ని, త‌న‌ను క‌ల‌వొద్ద‌ని ఆయ‌న సూచించారు. ఇందులో ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. తాను ప్ర‌స్తుతానికి వైద్యుల సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తూ క్షేమంగా ఉన్నాన‌ని త్వ‌ర‌లోనే తిరిగి అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటాన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

కాగా తెలంగాణ‌లో ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా క‌రోనాకు గుర‌వ్వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అస‌లే మంత్రులు, ఎమ్మెల్యేలు కావ‌డంతో వారి చుట్టూ ఉన్న కార్య‌క‌ర్త‌లు, అభిమానుల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అంతేగాకుండా అధికారులు, అన‌ధికారులు కూడా వారు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వారికి ఎవ్వ‌రి నుంచి క‌రోనా సోకింది? వారి ద్వారా మ‌రెంద‌రికీ క‌రోనా సోకింది అనే విష‌యాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

ఇటీవ‌ల ర‌వాణ శాఖ మంత్రి ప‌లు తెలంగాణ ఆర్టీసీ త‌ర‌ఫున నిర్వ‌హించిన ప‌లు అధికారిక కార్య‌క్ర‌మాలు, ప్రారంభోత్స‌వాల్లో పాల్గొన్న విష‌యం విదిత‌మే. వీరంద‌రూ కూడా ఇక క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని మంత్రి సూచించారు.

Related posts

ఆషాఢ బోనాలకు రూ.15 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Satyam NEWS

అన్నయ్యా…! ఆ ఇద్దరికీ ఏమైందో కనుక్కున్నావా…?

Satyam NEWS

సోమశిల పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో మద్యం విక్రయాలు

Satyam NEWS

Leave a Comment