నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఈ రోజు తెలంగాణ భూస్వామ్య వ్యతిరేక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు.
బాసర రజక సంఘ సభ్యులు ఈ సందర్భంగా ఐలమ్మకు ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన ఘనత ఆమెకే చెందుతుందని అన్నారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రజకులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
తక్షణమే హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాసర రజక సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.