ములుగు జిల్లా లోని భరోసా కేంద్రంలో సర్వీస్ రెగ్యులరైజేషన్ హక్కులు లేకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేసేందుకు తగిన మహిళా అభ్యర్థినిల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మహిళ భద్రతా విభాగం ప్రతినిధులు ప్రకటించడం జరిగింది. కాగా ఒక సంవత్సరం కాలవ్యవధి కొరకు ఒక కౌన్సిలర్, ఒక సపోర్ట్ పర్సన్, ఒక లీగల్ సపోర్ట్ అధికారి, ఒక రిసెప్షనిస్ట్, ఒక మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ANM) ఉద్యోగ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.
వీరి విద్యా అర్హతలు:
1.కౌన్సిలర్ ఉద్యోగానికి – M.SC సైకాలజీ/ MA సైకాలజీ/ ఎం.ఎస్.డబ్ల్యూ
2.సపోర్ట్ పర్సన్ ఆఫీసర్ ఉద్యోగానికి – ఎం.ఎస్.డబ్ల్యూ/ చైల్డ్ డెవలప్మెంట్ / సైకాలజీ విభాగం లో మాస్టర్స్ పూర్తి చేయాలి.
3.లీగల్ సపోర్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.యం (LLB/LLM) పూర్తి చేసి వుండాలి.
4. రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి – గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు కంప్యూటర్ లిటరేట్ అయి ఉండాలి. Tally ERP లేదా మరేదైనా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
5.మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(ANM) ఉద్యోగానికి బి.ఎస్.సి. నర్సింగ్/GNM (జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరి)/ANM (సహాయక నర్సు మరియు మిడ్‌వైఫ్)
వీరి గౌరవ వేతనం కౌన్సిలర్ ఉద్యోగానికి రూ.30వేలు,
సపోర్ట్ పర్సన్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.20వేలు,
లీగల్ సపోర్ట్ ఆఫీసర్ కు రూ.22వేలు,
రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి రూ.15వేలు,
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(ANM) ఉద్యోగానికి రూ.16వేలు గౌరవ వేతనం చెల్లించనుండగా నియామకం మొత్తం మహిళ భద్రతా విభాగం ప్రతినిధుల ద్వారా జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థినులు తమ బయో- డేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ను https://womensafetywing.telangana.gov.in/careers/ వెబ్ సైటు ద్వారా 15 రోజుల లోగా దరఖాస్తులు పంపించాలన్నారు.
పై దరఖాస్తు విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నచో Careers.Wsw@gmai.com లో సంప్రదించగలరు.