38.2 C
Hyderabad
April 29, 2024 13: 43 PM
Slider ఆధ్యాత్మికం

శాస్త్రోక్తంగా తిరుమలలో వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

tirumala 07

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.

శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.

ద్వాద‌శి ప‌ర్వ‌దినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవ‌లను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆల‌య ఓఎస్‌డి  పాల శేషాద్రి, విఎస్‌వో  మ‌నోహ‌ర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

దావోస్​లో ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

Satyam NEWS

ఈ ఎర్రబస్సు ఇక బతికే అవకాశం ఏ మాత్రం లేదు

Satyam NEWS

Leave a Comment