కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నకార్మిక వ్యతిరేక విధానాలను, ప్రయివేటీకరణను నిరసిస్తూ, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జనవరి 8న, హైదరాబాద్ లో కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు ఇందిరా పార్కు వద్ద కార్మిక సంఘాలు చేపట్టే ఆందోళనలో జర్నలిస్టులు పాల్గొనాలని టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఆయా జిల్లాల్లో జరిగే ఆందోళనల్లో టీయుడబ్ల్యుజె సైన్యం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
previous post