Slider ఆధ్యాత్మికం

పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లో వైభవోపేతంగా చండీహోమం

#chandihomam

గడచిన రెండేళ్ల నుంచీ కరోనా తో ఏ విధమైన సామూహిక కార్యక్రమాలు లేకుండా ఉన్న విజయనగరం జిల్లాలో అన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా నగరంలో ని పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లో బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యానార్ధం   చండీహోమం, రుద్రాభిషేకం కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమాలకు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  జేడ్పీ చైర్మన్ కు ఏబీఎస్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సాదర స్వాగతం పలికారు. ఈ మేరకు జేడ్పీ చైర్మన్ కు..అర్చకులు భమిడిపాటి..గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. దాదాపు గంటన్నర సేపు.. జిల్లా పరిషత్ చైర్మన్ ఆలయంలో గడిపారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ బ్రహ్మాణ సంక్షేమం కోసం తన వంతు కృషి తప్పకుండా చేస్తానని అన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో కూడ బ్రాహ్మాణ సంక్షేమానికి అధిక నిధులు కేటాయించారని అన్నారు. తమ ప్రభుత్వం బ్రహ్మాణ సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, అందరు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ సంఘం, జిల్లా అర్చక పురోహిత విభాగం సభ్యులందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్  మజ్జి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన సమావేశంలో

 జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు టీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ లోక కల్యాణం కోసం  ఈ కార్యక్రమం నిర్వాహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మాణ సంఘం  ప్రధాన కార్యదర్శి గన్నవరపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అధికారుల శ్రీనివాస్, బీపీఆర్ శాస్త్రి, సన్యాసిరావు, కిరణ్మయి, వీఎస్ ఎన్ కుమార్, కొల్లూరు జగన్నాధ శర్మ,

ప్రాత వెంకటేశ్వర శాస్ట్రీ, ఎం. గంగరాజు, గంటి శర్మ, రవీంద్ర కుమార్, సురేష్, మోతడక మురళి, చంద్రశేఖర్ శర్మ, శ్రీరంగం సత్య, మల్లీశ్వరి,యమిజాల ప్రభు, అర్చకపురోహిత విభాగ అధ్యక్షులు భమిడిపాటి రాంకుమార్ శర్మ, జిల్లా సంఘ ఉపాధ్యక్షులు ద్వాదశి వేణు, ద్వాదశి సుమతి, అర్చక పురోహిత విభాగ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ శర్మ, సూర్యనారాయణ శర్మ, మల్లాజోస్యుల అప్పలనసింహ శర్మ , రాళ్ళపల్లి మురళి కృష్ణ, మహాదేవ శర్మ,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

లీగల్ బ్యాటిల్: అమరావతి కోసం హైకోర్టులో పిల్

Satyam NEWS

టీడీపీ జనసేన కలిస్తే జగన్ రెడ్డి అవుట్

Satyam NEWS

యువత స్వయం ఉపాధి అవకాశాల వైపు అడుగులు వేయాలి

Satyam NEWS

Leave a Comment