Slider ఆంధ్రప్రదేశ్

ఆదుకోండి బాబు గారు లేకపోతే లావై పోతారు

cbn vijaya

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ”ఎన్టీఆర్-కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరింత పతనమవుతున్నాడు. వరదలొచ్చిన ప్రతిసారి వేల మంది నిరాశ్రయులవుతారు. ఇళ్లూ, పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే విషాద దృశ్యం. కానీ చంద్రబాబుకు వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తుంది. దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు అందజేసి ఆదుకోండి బాబు గారు. లేక పోతే లావై పోతారు” అని ఎద్దేవా విజయ సాయిరెడ్డి చేశారు.

Related posts

తెలంగాణ సూఫీ తాత్వికతకు ప్రతిష్టాత్మక అవార్డు

Satyam NEWS

పేద ప్రజల బాధలు తీరేది ఇలాగేనా సీఎం గారూ..?

Satyam NEWS

‘అత్యాచార’ వ్యాఖ్యలపై క్షమాపణలు

Sub Editor

Leave a Comment

error: Content is protected !!