కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ లో సంక్షోభం మొదలైందని, ఎమ్మెల్యేలు సైతం సీఎం కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇస్తానని నాయిని వంటి నేతనే మోసం చేశాడంటే కేసీఆర్ ఎలాంటివాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లను తెలంగాణ భవన్ కు పిలిపించుకుని, వాళ్ల కాళ్లు పట్టుకుని పార్టీలోనే కొనసాగాలని బతిమాలుకుంటున్నారని విమర్శించారు. రైతులను కేసీఆర్ మోసం చేశారని, రైతుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
previous post