36.2 C
Hyderabad
May 7, 2024 12: 33 PM
Slider విజయనగరం

విశాఖ రాజధాని కాకుండా అడ్డుకుంది…చంద్ర బాబే….!

#kolagatla

జగన్ ప్రభుత్వ హయాంలో నే విశాఖ… రాష్ట్ర రాజధాని గా ఏర్పడుతుందని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరికీ శుభాలు కలగాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర ని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి అభిలషించారు. శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు.

త్వరలో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అవుతున్న తరుణంలో  ఏ విధమైన అడ్డంకులు రానివ్వద్దని,  వచ్చిన అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగించమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్టు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్రలో  విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల  ప్రాంతానికి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం రావడం వల్ల, అభివృద్ధి పదం గా మేము అభివృద్ధి చెందుతాము, మా ప్రజలకు మరింత జీవనోపాధి కలుగుతుందనే ఉత్తరాంధ్ర ప్రజల ఆశ అని అన్నారు. ఆసియాలోనే   అతి వేగంగా అభివృద్ధి  పదం లో నడుస్తున్న విశాఖపట్నం రాజధానిగా ఏర్పడితే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తెలంగాణ రాజధాని హైదరాబాదుకు  వెన్నంటే నడిచే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూడా అది తోడ్పడుతుందనే ఆలోచనతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షనీయమని అన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారని తెలియజేశారు. ఏ ఆలోచనతో అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధానిగా అమరావతిని అక్కడ పెట్టారో, అదే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంగా మారిందని అన్నారు.

మద్రాస్ నుంచి విడిపోయి కర్నూలు రాజధానిగా ఆ రోజుల్లో ప్రకటిస్తే, అదే సమయంలో అప్పటికే దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన హైదరాబాదును రాష్ట్ర రాజధానిగా , అభివృద్ధి కూడా వేగంగా పెరగడంతో  అవకాశం వచ్చిందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ వెంట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో విజయనగరం మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, చిట్టి సన్యాసప్పుడు, పినవేమలి  సర్పంచ్ సాయి, గుంకలాం సర్పంచ్ కునుకు  నాగరాజు, పార్టీ నాయకులు బూర రాము నాయుడు, కొండకరకం రాంబాబు, డాక్టర్ చిట్టి రమణారావు తదితరులు ఉన్నారు.

Related posts

విశాఖ ఎన్ కౌంట‌ర్: త‌ప్పించుకున్న అగ్ర‌నేత‌లు…హెలీకాప్టర్ తో గాలింపు

Satyam NEWS

జర్నలిస్టు మధు మృతికి లోకేష్ సంతాపం

Satyam NEWS

వట పత్ర సాయిగా దర్శనమిచ్చిన కోదండ రాముడు

Satyam NEWS

Leave a Comment