27.7 C
Hyderabad
May 4, 2024 07: 25 AM
Slider మహబూబ్ నగర్

పవర్ కోసం పాట్లు పడుతు రైతుల రాస్తారోకో

#kalwakurthy

పవర్ కోసం ఎండలో పాట్లు పడుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో తాండ్ర సమీపంలో శుక్రవారం రైతులు కరెంటు కోతలతో అల్లాడుతూ రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో పాల్గొన్న కల్వకుర్తి కాంగ్రెస్ బ్లాక్ అద్యక్షులు కాయితి విజయ కుమార్ రెడ్డి రైతుల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలు నిరవధికంగా విద్యుత్ ను ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని గప్పాలు కొడుతున్న  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గాప్పాలతో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి దేశం మొత్తం 24 గంటలు విద్యుత్ ఇస్తామని ప్రగల్బాలు పలుకుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం 10 గంటలు కూడా రైతులకు విద్యుత్ సరఫరా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రాష్ట్రంలోనే ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం దేశం మొత్తం ఇస్తుందా అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు పగటిపూట నిరవధికంగా కోతలు లేని నాణ్యమైన మైన విద్యుత్ ను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరెంటు కోతలతో పంటలు పాడవుతున్నాయని వర్షాకాలంలో పడ్డ వర్షాలకు పత్తి, వరి, వేసిన రైతులు పంటలు నష్టపోయారని, ఇప్పటికే అప్పుల బాధ భరించలేక దేశంలోనే  అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని, రైతుల ప్రాణాలను బలిదానం చేస్తున్న టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిద్ర మేలుకొని ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చి రైతుల గోస వినాలని, లేకుంటే రానున్న రోజుల్లో వారి ఉసురు తగిలి పుట్టగతులు లేకుండా పోతాయని ఈ సందర్భంగా భవిష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హిందూ,ముస్లిం,క్రిస్టియన్ స్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

Satyam NEWS

కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

అన్నెం శిరీష కు సేవా నందిని అవార్డు

Satyam NEWS

Leave a Comment