పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల ఎంజీఆర్ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఫైల బాబ్జి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా పైల బాబ్జి మాట్లాడుతూ సరైన ఆధారాలు చూపకుండా రాజకీయ దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం నవ్యాంధ్ర నిర్మాత అయిన, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే సమర్థమైన నాయకుడు చంద్రబాబును అరెస్టు చేసి మరొకసారి సైకో బుద్దిని, ఈ సైకో ప్రభుత్వం బయటపెట్టిందని ఆరోపించారు.
ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని రాజకీయ దురుద్దేశంతో అలాగే చంద్రబాబు నాయుడు తనయుడైన లోకేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్యంగా మద్దత్తు వస్తుండటంతో తట్టుకోలేక ఈ సైకో ప్రభుత్వం చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. ‘సైకో పోవాలి సైకిల్ రావాలి’, ‘డౌన్ డౌన్ సిఎం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
కార్యక్రమంలో ఆయనతో పాటు తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, గోకవలస అశోక్, పడ్డాన డిల్లేశ్వరరావు, దండ ఏడుకొండలు, బరండి గోపాలరావు, గంగాడ భాస్కరరావు, ఉమా శంకర్,రాజేష్ మహా పాత్రోలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఎంజీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.