38.2 C
Hyderabad
May 2, 2024 21: 45 PM
Slider ప్రకాశం

పెళ్లి సంబంధం పేరుతో యువతి నుంచి 18 లక్షలు దోపిడి

#mallikagargips

మాట్రిమోనియల్ సైట్‌లతో అమాయక ఆడవాళ్ళను మోసం చేసిన ఘరానా సైబర్ మోసగాడిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన బాల వంశీకృష్ణ ఎలియాస్ ప్రతాపనేని రాజేష్ కుమార్ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన ఒక యువతి ప్రకాశం జిల్లా పోలీస్ స్పందన ప్రోగ్రామ్ లో ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ కు ఫిర్యాదు చేసింది.

ఎస్పీ ఆదేశాల మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేశారు. ఎస్పీ సూచనల మేరకు ఒంగోలు SDPO పర్యవేక్షణలో ఒంగోలు రూరల్ సిఐ, మద్దిపాడు SI తన సిబ్బందితో కలిసి ఒక ప్రత్యేకమైన టీంగా ఏర్పాటు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలోని సైబర్ టీం (IT Core) వారి సహకారంతో బాల వంశీ కృష్ణని పసిగట్టి ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు.

ఖమ్మ౦ కు చెందిన వంశీకృష్ణ 2008 సంవత్సరంలో కాకినాడ లోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ లో బి-ఫార్మసీ పూర్తి చేసి HSBC బ్యాంకు చెందిన కస్టమర్ కేర్ సెంటర్ లో పని చేసేవాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి షేర్ మార్కెట్ బిజినెస్ చేసుకుంటూ జీవనం కొనసాగించాడు.

2016 సంవత్సరంలో వివాహం చేసుకొని బెంగళూరు లో 2018 వరకు కాపురం ఉన్నాడు. గుర్రపు రేసులు, గ్యాంబ్లింగ్ లాంటి చెడు అలవాట్లకు బానిసై, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడం మొదలుపెట్టాడు. దాంతో అతని భార్య 2018 నవంబర్ నెలలో విడాకులకు అప్లై చేసి, 2019 లో అతడిని వదిలి వెళ్లిపోయింది. వ్యసనాలకు బానిసైన వంశీకృష్ణ ATM నేరాల కు పాల్పడి డబ్బులు సంపాదించేవాడు.

తరువాత ATM లకు OTP లు రావడం వల్ల ఆ నేరాలు మానేశాడు. వ్యాసనాలకు ఎక్కువ అవ్వడం వలన డబ్బులు అక్రమంగా, త్వరగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో Jeevansathi matrimonial.com లో  ప్రతాపనేని రాజేష్ కుమార్ పేరుతో అకౌంటు ను ఓపెన్ చేశాడు.

మాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పొందుపరిచిన మొబైల్ నెంబర్ ద్వారా వంశీకృష్ణ ను ఆ యువతి తల్లిదండ్రులు వివాహం గురించి సంప్రదించారు. తాను మూడు సంవత్సరాల నుండి న్యూయార్క్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు, ప్రస్తుతం కరోనా పరిస్థితుల వలన తను హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయినట్లు అతను చెప్పాడు.

ప్రస్తుతం తాను వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నట్లు 2022 మే నెల లోపు మళ్లీ న్యూయార్క్ వెళ్లాలని, ఈలోపే వివాహం జరిగి పోవాలని అతను కోరాడు. అయితే తనకు ఉన్న లోన్ క్లియర్ చేస్తే  సిబిల్ స్కోర్ పెరుగుతుందని అప్పుడు తనకు H1B వీసా వస్తుందని చెప్పాడు.

దాంతో యువతి తరపు వారు వివిధ మార్గాలలో, వివిధ దశల్లో మొత్తం Rs.17,49,649/- అతడికి అందచేశారు. అంతా చెల్లించిన తర్వాత వంశీ కృష్ణ తనను మోసం చేసినట్లు గా ఆ యువతి గుర్తించింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేసి Rs.8,00,000/- రికవరీ చేశారు.

ఇతనిపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 8 ATM బ్యాంక్ ఫ్రాడ్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులలో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ కేసును స్వల్ప కాలంలో ఛేదించినందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఒంగోలు రూరల్ సర్కిల్ పోలీసు బృందాన్ని ప్రశంసించారు.

ఒంగోలు డిఎస్పీ U.నాగరాజు, ఒంగోలు రూరల్ సిఐ R.రాంబాబు,  మద్దిపాడు SI T. శ్రీరామ్, మద్దిపాడు PS సిబ్బంది HC 573, CH ఊమమహేశ్వరరావు,  PC 2662 M Anil, PC 3547 K రాజేష్, HG-89 ఎస్ కె నాగూర్, IT Core సిబ్బందిని ఎస్పీ అభినందించి వారికి సర్టిఫికెట్లు, క్యాష్ రివార్డ్ అందచేశారు.

Related posts

కలకలం సృష్టిస్తున్న రష్యా పౌరుల అసహజ మరణాలు

Satyam NEWS

భరణం పేరుతో మహిళలను అవమానిస్తారా?

Satyam NEWS

షర్మిల పార్టీ వెనుక…. అంతా సస్పెన్సే… ఏదీ క్లారిటీ లేదు

Satyam NEWS

Leave a Comment