28.7 C
Hyderabad
April 28, 2024 11: 00 AM
Slider ముఖ్యంశాలు

షర్మిల పార్టీ వెనుక…. అంతా సస్పెన్సే… ఏదీ క్లారిటీ లేదు

#yssharmila

తెలంగాణ లో వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి వైఎస్ఆర్ పేరు వాడుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై ఎస్ విజయలక్ష్మి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వై ఎస్ షర్మిల తెలంగాణ సిఎం కేసీఆర్ వదిలిన బాణం అంటూ బిజెపి విమర్శ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సిఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు షర్మిలతో తెలంగాణలో పార్టీని పెట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు కూడా.

అయితే రాష్ట్రంలో బిజెపి పెరగడం లేదు కాబట్టి షర్మిలను రంగంలో దించి ఎన్నికల తర్వాత బిజెపి ఆమెతో పొత్తు పెట్టుకునే ప్లాన్ చేస్తున్నదని, నిజానికి షర్మిల బిజెపి వదిలిన బాణమని టీఆర్ఎస్ నాయకులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.

వై ఎస్ షర్మిలకు ఆమె సోదరుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో కుటుంబ కలహాలు తలెత్తాయని అందువల్ల షర్మిల తెలంగాణ లో సొంత పార్టీ పెట్టబోతున్నారని చాలా కాలం కిందటే ఆంధ్రజ్యోతి వార్త రాసింది.

దీన్ని అప్పటిలో కొందరు ఖండించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు… అంటూ షర్మిల ప్రకటించారు.

ఇప్పుడు వైఎస్ఆర్ పేరును వాడుకోవడానికి అభ్యంతరం లేదని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ మొత్తం చర్చ మళ్లీ మొదటికి వచ్చింది. వైఎస్ఆర్ టిపి అని పక్క రాష్ట్రంలో పార్టీ వస్తుంటే వైఎస్ఆర్ సిపి ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు?

వై ఎస్ విజయలక్ష్మి తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసే ఇలా నిరభ్యంతర సర్టిఫికెట్ ఇచ్చారా? అనే అంశం చర్చనీయాంశం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో వైఎస్ఆర్ టీపీ రిజిస్ట్రేషన్ పూర్తయింది. కొద్ది రోజుల కిందట.. తమకు వైఎస్ఆర్‌టీపీ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నారని.. అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని.. ఈసీ ప్రకటన ఇచ్చింది.

ఆ ప్రకటన మేరకు.. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో పేరు సారూప్యం ఉన్న పార్టీల నుంచి ఎన్‌వోసీలు కూడా ఆయా పార్టీలు ప్రారంభించాలనుకునే వ్యక్తులు సమర్పిస్తారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి లేఖ సమర్పించారు. నిజానికి గౌరవాధ్యక్షురాలిగా ఆమెకు అంత పవర్ ఉండదు.

ఆ పదవి అలంకార ప్రాయమే. అసలు అధికారం అధ్యక్షుడిగా జగన్‌కు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి.. సోదరి పార్టీ విషయంలో అభ్యంతరం లేదని లేఖ రాయడానికి తీరిక దొరకలేదమో కానీ తల్లి విజయలక్ష్మినే రాశారు.

ఆ లేఖను షర్మిల పార్టీ నేతలు ఈసీకి సమర్పించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. నిజానికి ఈ పేరు విషయంలో చాలా వివాదాలున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిక్కులు వచ్చాయి.

చివరికి కోర్టులో రిలీఫ్ లభించింది. ఈ కారణంగా పేరు సారుప్యం ఉన్న పార్టీల నుంచి అభ్యంతరం లేదన్న లేఖలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేపు వైఎస్ఆర్ టీపీ.. పార్టీపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం లేదు.

గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయలక్ష్మి లేఖ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అభ్యంతరాలు చెప్పలేదు కాబట్టి భవిష్యత్‌లో ఎప్పుడైనా వైసీపీ అబ్జెక్ట్ చేస్తే ఈసీ ఎంటర్ టైన్ చేసే అవకాశం ఉండదు.

Related posts

మృతి చెందిన అటెండర్ కుటుంబానికి సీబీఐటీ ఆర్ధిక సాయం

Satyam NEWS

కరోనా రోగుల కోసం ఆక్సిజన్ కాన్సన్ అందజేసిన జనసేన

Satyam NEWS

వర్ల సన్మాన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment