29.7 C
Hyderabad
May 3, 2024 06: 46 AM
Slider కరీంనగర్

ప్రేమ పేరుతో వల వేసి లక్షల్లో డబ్బు వసూలు

#CheatingBatch

ప్రేమ పేరుతో, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను కరీంనగర్ ఒకటవ టౌన్ పోలీసుల సహకారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కు చెందిన ఒక యువతి కరీంనగర్ లోని ఆదర్శ నగర్ లో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. జల్సాలకు అలవాటు పడి  సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుంటుంది.

వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని వారికి ప్రేమ పేరుతో, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి డబ్బు వసూలు చేస్తుంది. ఈమెకు ఒక ముఠా ఉంది. వీరంతా కలిసి వరంగల్ ప్రభుత్వ ఆస్పుత్రిలో ఊద్యోగం ఇప్పిస్తానని చెప్పి కరీంనగర్ లోని సిఖ్వాడి ప్రాంతానికి చెందిన యువకుని వద్ద పదమూడున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు.

కరీంనగర్ లోని తిరుమల నగర్ లో  నివాసం ఉంటున్న మరొక వ్యక్తి వద్ద ప్రభుత్వ ఊద్యోగం పేరుతో  ఏడు లక్షల రూపాయలు వసూలు  చేసారు. గోదావరిఖని కు చెందిన మరొక యువకుని వద్ద మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు.

ప్రేమ పేరుతో ఛాటింగ్ అవి చూపి బ్లాక్ మెయిల్  

వరంగల్ కు చెందిన యువకునితో నికితరెడ్డి గా పరిచయం చేసుకొని అతనితో సన్నిహితంగా మాట్లాడుతూ ఆతనితో చాటింగ్ చేసిన సంభాషణలు భద్రపర్చుకొని అతనిని బ్లాక్ మెయిల్ చేస్తూ అతని వద్ద నుండి ఎనిమిది లక్షల రూపాయలు వసులు చేసింది.

బాధితులు తిరిగి డబ్బులు అడిగితే తన మూఠా సభ్యులను పెద్ద మనుషులుగా చూపించి భద్రపర్చిన చాటింగ్,  సంభాషణలు చూపిస్తూ ఎదురు కేసులు పెడతానని యువకులను బెదిరింపులకు గురి చేస్తుంది.

టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ ఆర్.ప్రకాష్, కె.శశిధర్ రెడ్డి, కరీంనగర్ ఒకటవ పోలీస్ స్టేషన్  సిఐ. విజయ్ కుమార్,   టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్  పి.కరుణాకర్,  బి.స్వామి, నరేష్ రెడ్డి,  టాస్క్ ఫోర్స్ ఏఏస్ఐ-నరసయ్య లతో పాటు  ప్రత్యేక బృందాల  సభ్యులు, టాస్క్ ఫోర్స్ కరీంనగర్ ఒకటవ పోలీస్ స్టేషన్  సిబ్బంది కలిసి వలపన్ని ఈ మాయలేడిని పట్టుకున్నారు.

ఆమెతో బాటు బెల్లంపల్లి కి చెందిన కంబాల  రాజేష్, కుసుమ  భాస్కర్,  భీమా శంకర్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి పై హైదరాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లి  పోలీస్ స్టేషన్లో, వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో, గోదావరిఖని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు అయ్యాయి.

ఇలాంటి వారి మాయ మాటలు నమ్మవద్దు

కరీంనగర్ సిపి శ్రీ వి.బి. కమలహాసన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మిస్తూ అమాయకుల మోసం చేసే వారి మాయమాటలు నమ్మి డబ్బు, సమయం నష్ట పోవద్దని, అలాంటి మోసగాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పితే వారి సమాచారం పోలీసులకు అందించాలని తెలిపారు.

ఉద్యోగాలు పెట్టిస్తామని మోసం చేసిన వారిపై  PD ఆక్ట్ కూడా నమోదు చేస్తామని, ఇప్పటికే పలువురు ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వారిపై PD ACT పెట్టామని తెలిపారు.

Related posts

హిజ్రాలతో డ్రామాలు ఆడుతున్న వైసీపీ నాయకులు

Satyam NEWS

సక్సెస్ సెల్ఫీకి ప్రిన్స్ సంతకం

Satyam NEWS

కాలువల ఆక్రమణల వలనే ఇండ్లు మునక

Satyam NEWS

Leave a Comment