24.2 C
Hyderabad
October 14, 2024 20: 42 PM
Slider నెల్లూరు

హిజ్రాలతో డ్రామాలు ఆడుతున్న వైసీపీ నాయకులు

#raghurama

నెల్లూరు జిల్లాలో క్వార్జ్ మైనింగ్ లో కొంతమంది వ్యక్తులు కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. శాండ్, క్వార్జ్, మైకా మైనింగ్ లైసెన్సులు ఎవరి పేరిట ఉన్నప్పటికీ, జిల్లాలోని మండలాలను, గ్రామాలను అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలకు పంచడం జరిగింది. దీనితో మైనింగ్ లైసెన్సులన్నీ వారికే అనధికారికంగా కేటాయించినట్లయింది. ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తి నుండి ఆదేశాలు వెలువడడం వల్ల, జిల్లాలోని ఉన్నతాధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని చేయలేదు.

గనుల అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపితే, అన్ని విషయాలు బయటకు వస్తాయి అని ఆయన అన్నారు. ఇప్పుడు కాకపోయినా రేపు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమార్కుల పని పట్టడానికి సులువు అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. మైనింగ్ యజమానిని  ఆశీర్వదించడానికి హిజ్రాలను పిలిపించుకోవడం సర్వసాధారణమే కానీ, మైన్ ను ఆశీర్వదిస్తారని చెప్పి వందలాది మంది హిజ్రాలను పొదలకూరు రుస్తుం  మైనింగ్ వద్దకు తరలించడం  ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రుస్తుం  మైన్ వద్ద మూడు రోజులపాటుగా తెదేపా సీనియర్ నాయకుడు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపడుతుండగా, ఆయన పై దాడి కి హిజ్రాలను పంపారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే తెదేపా కార్యకర్తలు, నాయకులు ఆయనకు వెన్ను దన్నుగా నిలిచారు. రుస్తుం మైనింగ్ లో తవ్విన 12 ట్రక్కులను  తరలించడానికి ఈ డ్రామా ఆడినట్టు స్పష్టమవుతుంది. గతంలో నేరుగా పోలీసులతోనే ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించేవారు. ఇప్పుడు హిజ్రాలతో దాడి చేయించే  కొత్త సంస్కృతికి తెర లేపారు. రుస్తుం మైనింగ్ వద్ద  నిరసన చేపడుతున్న చంద్రమోహన్ రెడ్డిని  పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Related posts

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే లక్ష్యం

Satyam NEWS

కరోనా నెగెటీవ్ వచ్చినా మీరు జాగ్రత్తలు పాటించాలి

Satyam NEWS

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment