37.2 C
Hyderabad
April 30, 2024 14: 50 PM
Slider ఆదిలాబాద్

ఈ ఆఫీస్ అప్లికేషన్ ద్వారా నే ఇక పోలీసు సేవలు

#E-Office

నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆఫీసు అప్లికేషన్ అమలు విధానంపై నేడు ఒక రోజు శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ప్రతి ఫైల్ ఈ ఆఫీస్ అప్లికేషన్ ద్వారానే జరగాలని అన్నారు.

ఈ ఆఫీస్ అప్లికేషను అమలైతే సమయం వృధా కాకుండా వెంటనే ఆన్లైన్ ద్వారా పనులు జరుగుతాయని ఆయన అన్నారు. నాణ్యమైన డేటా అందుబాటులో ఉంటుందని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ నిరంతరంగా ఉంటుందని ఆయన తెలిపారు.

అందువల్ల సిబ్బంది పనితనం మెరుగుపడటమే కాకుండా వేగవంతమైన పని కార్యాలయాల్లో జరుగుతుందని తెలిపారు. HRMS అప్లికేషన్ లో పోలీసు అధికారులు, సిబ్బంది సర్వీస్ కు సంబంధించిన డాటా ఎంట్రీ చేయాలని సూచించారు.

 డాటా ఎంట్రీ చేసిన తర్వాత పూర్తి పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని భవిష్యత్ కాలంలో ఉద్యోగుల ప్రమోషన్, పెన్షన్ ఇంక్రిమెంట్ తదితర విషయాలు ఎస్పీ స్థాయి నుండి డీజీపీ స్థాయి అధికారుల వరకు ప్రతిరోజు పర్యవేక్షణ చేయవచ్చని తెలిపారు.

ఈ ఆఫీస్ అప్లికేషన్ గురించి జిల్లా కల్లెక్టరేట్ కార్యాలయం EDM మేనేజర్, నదీం ఖాన్, HRMS అప్లికేషను గురించి ఐటీ కోర్ ఇంఛార్జి మురాద్ అలీ పవర్ పాయింట్ ప్రేసేంటేషన్ ద్వారా అప్లికేషనులు పని చేయు విధానంపై వివరించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ AO వెంకట శేఖర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రవీందర్, ఐటీ కోర్ ఇంఛార్జి మురాద్ అలీ, జిల్లాలోని CCTNS writers, DSB writer, DCRB, RI writers, CCS writer, PCR, I/C communication, I/C FPB, IT Core team members, DPO సిబ్బంది నిర్మల్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

దుబాయ్ లో భారీ వర్షంతో జన జీవితం అతలాకుతలం

Satyam NEWS

అన్ని ఏర్పాట్లు పూర్తి

Murali Krishna

అనంత పద్మనాభుడి ఆలయంలో లక్ష దీపాలు వెలిగే రోజు నేడు

Satyam NEWS

Leave a Comment