35.2 C
Hyderabad
May 1, 2024 02: 22 AM
Slider కడప

కాలువల ఆక్రమణల వలనే ఇండ్లు మునక

#KadapaCollector

కడప జిల్లా నందలూరు బస్ స్టాండ్ ప్రాంతంలో ఇండ్లలోకి ప్రవహిస్తున్న చెయ్యేటి నీటిని మంగళవారం సాయంత్రం రాజంపేట సబ్ కలెక్టర్ కేతాన్ గార్గ్ పరిశీలించారు.

స్వయంగా ఆయన నీటిలో తిరుగుతూ పరిస్థితి అంచనా వేశారు. ఈ సందర్భంగా బాధితులు తాము పదిరోజులు చెయ్యేరు నీరు ఇండ్ల లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆయనకు మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలు కబ్జాకు గురి కావడం మూలంగా వరద నీరు వచ్చినట్టు తెలిపారు. ఇందులో ఇరిగేషన్,పంచాయతీ రాజ్ శాఖలతో పాటు ప్రజల తప్పిదం ఉందన్నారు.

వరద నీరు వచ్చినప్పుడు ప్రతి సారి ఇదే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

దాదాపు 150 ఇండ్లు క్రింద భాగం నీట మునిగాయని,నీటి ఉధృతి తగ్గిన తరువాత కాలువల అక్రమాల తొలగింపు ఒక్కటే శాశ్వత పరిష్కారమని ఆయన తెలిపారు. ఆ దిశగా ఇరిగేషన్ ,వారికి సూచనలు ఇవ్వ నున్నటు ఆయన తెలిపారు.

Related posts

సినీ దర్శకుడు మదన్ హఠాన్మరణం!!

Satyam NEWS

పేద రైతుల భూములు లాక్కోవద్దు

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మపై టాలివుడ్ బహిష్కరణ వేటు?

Satyam NEWS

Leave a Comment