40.2 C
Hyderabad
May 6, 2024 15: 44 PM
Slider మహబూబ్ నగర్

భగీరథ కార్మికుల అసెంబ్లీ ముట్టడి

#missionbhageratha

మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పైన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్ లో మిషన్ భగీరథ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల  చేశారు. ఫిబ్రవరి 6న చలో అసెంబ్లీ ముట్టడి ఇందిరాపార్క్ మహాధర్నా జయప్రదం చేయాలని జేఏసీ కో కన్వీనర్ ఉమాశంకర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి రావాలని తెలంగాణ ప్రభుత్వ ఇంటింటికి మంచినీరు మిషన్ భగీరథ పథకం ద్వారా అందజేస్తున్నారని అందులో 16 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కనీస వేతనాలు లేక లైన్ మెన్ లకు ప్రయాణ చార్జీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఒక్కొక్క జిల్లాలో ఒక్కో వేతనం ఇస్తున్నారని, అలాకాకుండా కార్మికుల కనీస వేతన 26,000 ఇస్తూ ప్రయాణ చార్జీ ఇవ్వాలని, ఈ ఎస్ ఐ, పి ఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చలో అసెంబ్లీ ముట్టడి కరపత్రాలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ శ్రీనివాస్ గౌడ్ సాబీర్ శేఖర్ రవీందర్ రవి ప్రసాద్ శివరాజ్ శ్రీనివాస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

సర్టిఫికెట్: ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ

Satyam NEWS

థాంక్ గాడ్: ఊపిరి పీల్చుకున్న నాగర్ కర్నూల్

Satyam NEWS

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి

Bhavani

Leave a Comment