39.2 C
Hyderabad
May 3, 2024 12: 51 PM
Slider పశ్చిమగోదావరి

ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

#employment guarantee

ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడితే ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగాలు ఊడిపోతాయి అని ఏలూరు జిల్లా
డ్వామా పి డి రాంబాబు హెచ్చరించారు. టి ఏ లను పీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం నమ్మి కొట్లాది రూపాయల మీ చేతుల్లో పెడుతుంటే ప్రభుత్వ ప్రతిష్ట కు భంగం కలిగిస్తున్నారని పీల్డ్ అసిస్టెంట్లపై పి డి మండి పడ్డారు.

ఉపాధి పనులు కేవలం పేదల జీవనోపాదికి కల్పించినవేనని, ఈ పనులలో అధికార ప్రతి పక్షనాయకులకు, వాళ్ళ అనుచరులకు సంబంధం లేనివన్నారు. పేదలను గుర్తించి వారికి 100 రోజులకు తగ్గకుండా పని కల్పించి ఆదుకోవడమే ఈ పథకం ఉద్దేశమని పి డి చెప్పారు.

గ్రామీణ పట్టణ శివారు ప్రాంతాలలో నిరుపేద వ్యవసాయ కార్మికుల కు జీవనోపాధి కల్పించి ఆదుకునేందుకు చేపట్టిన ఉపాధి హామీ కరువు పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడే పీల్డ్ అసిస్టెంట్లను, టెక్నీకల్ అసిస్టెంట్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని, అవినీతికి పాల్పడి స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేయడం తో పాటు అవసరమైతే విదుల నుండి తొలగించడానికి వెనుకాడబోమని ఏలూరు జిల్లా డ్వామా పి డి రాంబాబు హెచ్చరించారు.

పెదవేగి మండలం లో 2020నుండి 2021 వరకు 2021 నుండి 2022 మార్చి నెల మధ్య కాలంలో కరువు పనులలో జరిగిన అవకతవకలపై మాత్రమే బుధవారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లో ఎం పి పి తాతా రమ్య అధ్యక్షతన సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో మండలం లో ఉన్న 30 గ్రామ పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో జరిగిన ప్రగతి, ఆ ప్రగతి ముసుగులో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను సోషల్ ఆడిట్ చేసిన డి ఆర్ పి లు బహిరంగ ప్రజా వేదికలో ఆ సర్వేలలో వెలుగు చూసిన అవినీతి అక్రమాల నివేదికలను చదివి వినిపించారు.

ఈ నివేదికలో తాళ్లగోకవరం, బాపిరాజుగూడెం, చక్రాయగూడెం, విజయరాయి, వంగూరు, కవ్వగుంట, బి సింగవరం, కె కన్నాపురం తదితర గ్రామాలలో పీల్డ్ అసిస్టెంట్లు టి ఏ లతో కలిసి కుమ్మక్కై పనులు చేయకుండా చేసినట్టు రికార్డ్ లలో చూపి, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా జాబ్ కార్డ్ లలో చేర్చి, మృతిచెందిన వారు కూడా పనిచేసినట్టు చూపి, గ్రామాలలో లేని వారిని, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లు జాబ్ కార్డుల్లో చూపి.100 రోజుల పని దినాలు పూర్తయిన వారికి కూడా పనులు కల్పించి, సంతకాలు వేలిముద్రలు ఫోర్జరీ చేసి బారి ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ప్రాజావేదికలో వెలుగు చూశాయి. గతంలో ఓ మండల అధికారి ఎఫ్ ఏ ల నుండి టి ఏ ల నుండి నెలవారీ మామూళ్లు తీసుకుని వారు అవినీతికి పాల్పడినా పట్టించుకోక పోవడంతో ఎఫ్ ఏ లు .

టి ఏ లు మస్టర్ లలో ఫోర్జరీ సంతకాలు, రికార్డులను తారుమారు చేయడం అవినీతి అక్రమాలకు పాల్పడటానికి అలవాటు పడినట్టు సమాచారం. పేదలకు కరువు పనులను పారదర్శకంగా కల్పించి పది మందిలో ఉపాధి పథకం విలువలు కాపాడాలని అన్నారు. భవిష్యత్తులో తీరు మార్చుకోకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయని పి రాంబాబు టి ఏ లను.ఎఫ్ ఏ లను తీవ్రంగా హెచ్చరించారు.

Related posts

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కుటుంబం

Satyam NEWS

కార్పొరేట్ కు  ధీటుగా మన ఊరు మన బడి

Satyam NEWS

చీమలపాడు గ్రామస్థుల ఆందోళన

Bhavani

Leave a Comment