30.7 C
Hyderabad
April 29, 2024 04: 35 AM
Slider కరీంనగర్

ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు 24న ఛలో అసెంబ్లీ

#SugarcaneFarmers

ముత్యంపేట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చెరకు రైతులు ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు.

అందులో భాగంగా ఈ నెల 24వ తేదీన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో చెరకు రైతులకు జీవనాధారంగా ఉండే ముత్యం పేట్ చక్కెర ఫ్యాక్టరీని అన్యాయంగా మూసివేశారని రైతులు అన్నారు.

తక్షణమే ముత్యంపేట్ చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఈ నెల 24న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చామని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి వెల్లడించారు.

రైతులకు చలో అసెంబ్లీ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు నేడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లోని కట్లకుంట, పోరుమల్ల, తుంబారావుపేట లో ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా కన్వీనర్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి  రైతులను వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు.

Related posts

కరోనాతో శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోమ్‌

Sub Editor

ఆత్మరక్షణ కోసం దళితుల చేతికి ఏమిస్తారో చెప్పగలరా?

Satyam NEWS

11న ఛలో ఆత్మకూరు విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment