26.7 C
Hyderabad
May 1, 2025 05: 05 AM
Slider ఆంధ్రప్రదేశ్

11న ఛలో ఆత్మకూరు విజయవంతం చేయండి

cb naidu

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి పల్నాడును రక్షించుకోవటానికే ఈ నెల 11న జరిగే ఛలో ఆత్మకూరు సభకు రావాలని టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం ఒంటరి కాదు అని ఈ పర్యటన ద్వారా తెలుపుదాం. తెలుగుదేశం ఓ వ్యక్తి కాదు ఓ పెద్ద వ్యవస్థ అని ఛలో ఆత్మకూరు ద్వారా చాటుదాం. ఛలో పల్నాడుకు నాయకులంతా తరలి రావాలి. పోలీసులు పెట్టె ప్రతి అక్రమ కేసు కు సమాధానం చెప్పేలా చేద్దాం అని ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులో అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి మానవహక్కుల సంఘానికి తెలపడంతో పాటు ప్రయివేటు కేసు లు నమోదు చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీన న్యాయవాదుల సమావేశం నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి లీగల్ సెల్ కి సంబంధించిన న్యాయవాదులంతా దీనికి వస్తారని ఆయన అన్నారు. లీగల్ సెల్ ను పటిష్ట పరుచుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు, అక్రమ కేసులకు సమాధానం చెబుదామని ఆయన అన్నారు. బాబాయి ని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

Related posts

న్యూ డైమన్షన్: భోగి మంటల కోసం గుడిసె తగలబెడతామా?

Satyam NEWS

అప్పుల బాధ తాళలేక ఉరివేసుకున్న వివాహిత

Satyam NEWS

ట్రైడ్@క్రైడ్:మంటలనుచూసి పారిపోయినఏటీఎందొంగలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!