27.7 C
Hyderabad
May 14, 2024 10: 54 AM
Slider నల్గొండ

మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం 12న కలక్టరేట్ ముట్టడి

#Roshapati

టిఆర్ఎస్ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలు చేస్తుందని, హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు ఉంటే అక్కడి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పెంచలేదని, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు వదులుకొని సుదీర్ఘ పోరాటం చేసిన వారికి పిఆర్సిని ఊరిస్తూ 34 నెలలు సాగదీస్తూ మొండిచేయి చూపిందని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో CPM పార్టీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం రోషపతి కార్మికులతో మాట్లాడుతూ ఈనాడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, కరోనా సమయంలో ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేసిన మున్సిపల్ కార్మికులకు నెలకి 19,000 రూపాయలు కాకుండా 24 వేల రూపాయలు వేతనం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

హుజూర్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యుడు  కార్మికులకు న్యాయం చేస్తానని, అసలైన కమ్యూనిస్టులు కెసిఆర్ అని ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ  ప్రకటన చేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలలో డెబ్బై శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన పిదప స్థానికులకు సిమెంట్ పరిశ్రమలలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది చెప్పాలని అన్నారు. 

అభివృద్ధి అంటే ఏమిటో హుజూర్ నగర్ పట్టణంలోని రోడ్లను చూస్తే తెలుస్తుందని అన్నారు. పదకొండవ పి ఆర్ సి ని శాసనసభలో కనీసం 24000 ఇచ్చే విధంగా, అసంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్ర వేతన చట్టం పోరాటం చేసి ఇప్పించాలని కోరారు. ఈనెల 12వ,తేదీన మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం జరిగే కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తరలి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలక సోమయ్య గౌడ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ, మెరుగు దుర్గారావు, రవి,సైదులు, గోవిందు, కుమారి, దేవకర్ణ, చంద్రకళ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

Satyam NEWS

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి

Murali Krishna

దిశ యాప్ ఎక్కడ?: చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment