19.7 C
Hyderabad
January 14, 2025 05: 05 AM
Slider ఆంధ్రప్రదేశ్

మానవత్వంతో ఆడుకున్న సైకిల్ బ్యాచ్

hospital 1

ఎవడైనా సరే రోగులతో ఆడుకుంటాడా? ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ బ్యాచ్ ఈ పని చేసినట్లు ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేద రోగులకు విడుదల చేసే చెక్కులు ఎంఎల్ఏలకు చేరేవి. వాటిని వారు రోగులకో వారి సంబంధీకులకో అందచేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి సహాయనిధి కింద విడుదలైన చెక్కులను రోగులకు ఇవ్వకుండా కొంత మంది వారి వద్దే ఉంచుకున్నారు. ఎన్నికల్లో ఓటు వేస్తే చెక్కులిస్తాం అని కూడా కండిషన్ పెట్టారు. తీరా చూస్తే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇలా చేసిన వారు ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత రోగులు వెళ్లి బతిమిలాడితే చెక్కులు తిరిగి ఇచ్చారు. అయితే అప్పటికే వాటి కాల పరిమితి ముగిసిపోయింది. ఇలా చాలామంది శాసన సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులు చెక్కులను తమ వద్దే మురగ పెట్టేరు. విజయవాడ నగరానికి చెందిన ఒక శాసన సభ్యుడు గత ఎన్నికలలో కేవలం 30 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓడిపోయిన తరువాత తన పి ఏ ద్వారా సుమారు 200 చెక్కులను తిరిగి ప్రభుత్వానికి తిరిగి పంపించినట్లు తెలిసింది. ఈ విధంగా వేలాది మంది పేదలకు తమకు దక్కాల్సిన పరిహారం దక్కక నష్ట పోయారు. ఈ చెక్కులను తమవద్దే ఎందుకు వుంచుకున్నారో  వారికే తెలియాలి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే కొత్త ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని గొగ్గోలు పెట్టడం విడ్డురం.

Related posts

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో జీవిత ఖైదు

Satyam NEWS

విష్ణుపురం నుండి వయా మఠంపల్లి మీదుగా ప్యాసింజర్ రైలు ప్రారంభించాలి

Satyam NEWS

కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలి:ఐఎన్ టియుసి

Satyam NEWS

Leave a Comment