33.7 C
Hyderabad
April 30, 2024 01: 33 AM
Slider వరంగల్

గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు

#mulugu dist

ములుగు జిల్లాలోని 174 గ్రామ పంచాయతీలకు కు గాను141  గ్రామ పంచాయతీలలో  శుక్రవారం  బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. మిగిలిన ౩౩ గ్రామ పంచాయతిలలో వారం రోజులలో బాలల పరిరక్షణ కమిటి లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

బాలల పరిరక్షణ కమిటీలు గ్రామ సర్పంచి అధ్యక్షతన అంగన్వాడి టీచర్ కన్వీనర్ గా, పంచాయతీ సెక్రెటరీ కో కన్వీనర్  ఆశ కార్యకర్త , గ్రామా మత పెద్దలు, గ్రామ పోలీస్ అధికారి, గ్రామ రెవిన్యూ అధికారి, బాలల తల్లి తండ్రులు, బాలల సంఘాల సభ్యులు, ఉపాద్యాయులు , స్వచ్చంద సంస్థలు ఈ  కమిటి లోని సభ్యులుగా ఉంటారు.

ప్రతి గ్రామా పంచాయతి కి ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయడం తప్పనిసరి. గ్రామాన్ని బాలల స్నేహపూర్వక గ్రామంగా మార్చడం ఈ బాలల రక్షణ కమిటీ ప్రధాన కర్తవ్యం. అంటే గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా, బాలలందరూ బడికి వెళ్లేలా, బాలకార్మికులు లేకుండా, ఎలాంటి వేధింపులు జరగకుండా ఉండడానికి కమిటీలు పనిచేస్తాయి .

బాలల సమస్యలపై బాలలు వెల్లడించే అభిప్రాయాలకు సరైన విలువ లభించేలా బాలల పరిరక్షణ కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామంలో పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా  ఈ కమిటీ వెంటనే స్పందించి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.

డి సి పి యు, ఐ సి డి ఎస్, చైల్డ్ లైన్ సిబ్బంది వివిధ గ్రామాలలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడంలో పాల్గొని కమిటీ ప్రాముఖ్యతను కమిటీ నిర్వహించవలసిన పనుల గురించి ప్రజలకు వివరించారు.

 జిల్లా సంక్షేమ అధికారిణి ఇ ఈ ప్రేమలత, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కే స్వాతి  ములుగు, వెంకటాపురం గ్రామ పంచాయతీలలో, ములుగు సిడిపిఓ లక్ష్మి వెలుతుర్ల పల్లి గ్రామపంచాయతీలో, తాడ్వాయి సిడిపిఓ మల్లీశ్వరి మొట్లగుడేం గ్రామపంచాయతీలో, ఏటునగరం సిడిపిఓ హేమలత ఏటునగరం గ్రామపంచాయతీ లో, డి సి పి ఓ ఓంకార్ నూగురు, B,C మర్రిగుడ్ గ్రామ పంచాయతీలలో చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ప్రణయ్ గుమ్మడి దొడ్డి గ్రామ పంచాయతీలలో  నిర్వహించిన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు సమావేశాలలో పాల్గొన్నారు

బాల సహాయక కిట్టు నిత్యావసరాల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో, కో విడ్ విపత్తులో బాలల సహాయ వాణి టోల్ ఫ్రీ నెంబర్ 040 – 23733665  ప్రారంభించడం జరిగినది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టువంటి పిల్లలను  గుర్తించినట్లయితే ఈ నెంబర్ కి కాల్ చేసి  సమాచారం అందించినట్లు అయితే జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు పిల్లలకు కావాల్సిన సేవలను అందిస్తారు.

ఆపదలో రక్షణ సంరక్షణ అవసరమైన బాలల కొరకు 24 × 7 అందుబాటులో ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి  సమాచారం తెలిపినట్లు అయితే బాలలకు కావలసిన సత్వర న్యాయాన్ని అందించడం జరుగుతుంది

జిల్లాలో కోవిడ్ బారినపడిన పిల్లలకు, కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన పిల్లలకు, తల్లిదండ్రులకు కోవిడ్ వచ్చిన వారి పిల్లలకు కు నిత్యావసర సరుకుల  బాల సహాయక కిట్లు పంపిణీ చేశారు. ఈరోజు జిల్లాలోని 9 మండలాలలో  78 బాల సహాయక నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయడం జరిగినది.

Related posts

రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

Bhavani

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

Satyam NEWS

రాజకీయ లబ్ది కోసం బీజేపీ యత్నం

Bhavani

Leave a Comment