33.7 C
Hyderabad
April 28, 2024 23: 19 PM
Slider హైదరాబాద్

బాలల దినోత్సవ శుభాకాంక్షలు మంత్రి

Satyavathi Rathod

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ బాలలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఘనంగా పిల్లలు సందడిగా ప్రతి ఏటా నిర్వహించుకునే బాలల దినోత్సవం కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది నిరాడంబరంగా నిర్వహించుకోవాల్సి రావడం బాధాకరమన్నారు.

పిల్ల‌ల విద్యావికాసానికే అంగ‌న్‌వాడీలు

ఈ రాష్ట్రంలో బాలలందరూ ఆరోగ్యంగా ఉండాలని, విద్యాపరంగా దేశంలో ఎవరికీ తీసిపోని విధంగా తయారు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో చాలా గొప్ప కార్యక్రమాలు అమలు జరుగుతన్నాయన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు గతంలో నెలకు 8 గుడ్లు ఇవ్వగా 2015 నుంచి నెలకు 30 గుడ్లు అందిస్తున్నారని, వీటితో పాటు అన్నం, పప్పు, కూరగాయలతో కూడిన భోజనం, స్నాక్స్ కూడా అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు, నర్సరీలుగా అంగన్వాడీలను తీర్చిదిద్ది వారి విద్యా వికాసానికి కృషి చేస్తున్నామన్నారు. వీటితో పాటు ప్రతి రోజు పాలు, బాలామృతం, బాలామృతం ప్లస్ వంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి సమగ్ర అభివృద్దికి పాటుపడుతు న్నామన్నారు.

ఇంద్ర‌ధ‌న‌స్సు ప‌థ‌కం టీకాలు

నవజాత శిశువుల నుంచి ఆరేళ్ల వరకు బాలలకు అంగన్ వాడీలలో, ప్రాథమిక కేంద్రాల ద్వారా, ప్రభుత్వ దవాఖానాలలో ఇంద్రధ‌నస్సు పథకం ద్వారా టీకాలు వేయిస్తూ భవిష్యత్ లో వచ్చే రోగాల బారి నుంచి కాపాడుతూ వారిలో రోగ నిరోధకత పెంపొందిస్తున్నట్లు వివరించారు.

త‌ల్లుల‌కు పౌష్టికాహారం అంద‌జేత‌

పుట్టిన శిశువులు, బాలలకే కాకుండా పుట్టబోయే శిశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఉద్దేశ్యంతో తల్లులకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ, వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేస్తూ, తగిన వైద్య సాయం అందిస్తున్నామన్నారు. ఆరోగ్య లక్ష్మీ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ బాలల భవితవ్యానికి భరోసా కల్పిస్తున్నామన్నారు.

కేసీఆర్ కిట్‌, అమ్మ ఒడి ప‌థ‌కాల‌కు ప్ర‌జాద‌ర‌ణ‌

కేసిఆర్ కిట్ ద్వారా పుట్టిన శిశువులకు దోమతెరలు, బెడ్స్, సబ్బులు, నూనెలు, పౌడర్లు, డైపర్లు, షాంపులు, దుస్తులు, ఆటబొమ్మలు అందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని, ఈ కేసిఆర్ కిట్ ను అనేక రాష్ట్రాలు అభినందిస్తున్నాయన్నారు. గర్భిణీ స్త్రీ ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చేలా గర్భం దాల్చిన ఆరు నెలల నుంచి ప్రసవం అనంతరం మూడు నెలల వరకు నెలకు 2000 రూపాయల చొప్పున 12వేల రూపాయలను ఇచ్చి, ఆ గర్భిణీ స్త్రీ పనిచేయకుండా ప్రసవం పొందేలా ఆర్ధిక సాయం చేస్తున్నారని, అమ్మఒడి పథకం ద్వారా క్షేమంగా దవాఖానాకు చేరి ప్రసవం జరిగేలా, ప్రసవం అనంతరం మళ్లీ క్షేమంగా ఇంటికి వచ్చేలా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామన్నారు.

దేశంలో పిల్లలకు టీకాలు వేయడంలో బెస్ట్ స్టేట్ గా, మీజిల్స్, రుబెల్లా క్యాంపెయిన్ చేయడంలో, న్యూ బార్న్ కేర్ విషయంలో దేశంలో మన రాష్ట్రం అనేక అవార్డులు గెలుచుకుని బాలల ఆరోగ్యానికి, వారి వికాసానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచిందన్నారు. 

రేపటి తరం తెలంగాణలో ఆరోగ్యంగా ఉండేందుకు సిఎం కేసిఆర్ నాయకత్వంలో చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యమై, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా మరోసారి రాష్ట్ర బాలలకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

చంద్రబాబును  జైల్లోనే చంపేస్తారా?

Satyam NEWS

కల్తీ సారా కన్నా ప్రమాదకర బ్రాండ్లు సరఫరా చేస్తున్నారు

Satyam NEWS

నిజమైన నిరుపేదలను గుర్తించేందుకు సాంకేతిక సహకారం

Satyam NEWS

Leave a Comment