29.7 C
Hyderabad
April 29, 2024 07: 34 AM
Slider ఆంధ్రప్రదేశ్

కల్తీ సారా కన్నా ప్రమాదకర బ్రాండ్లు సరఫరా చేస్తున్నారు

lokesh ntr

గతంలో ఎప్పుడైనా మీ ఊరు వస్తే బాగున్నారా ? అని పలకరించేవాడిని, తుగ్లక్ రివర్స్ పాలన లో ఇప్పుడు బ్రతికున్నారా అని అడగాల్సి వస్తున్నది అంటూ సెటైర్ వేశారు నారా లోకేష్. నేడు తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఆయన ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు. వై ఎస్ జగన్ 9 నెల‌ల పాల‌న‌ని మూడు ముక్క‌ల్లో చెబుతా అంటూ ఆయన 9 రద్దులు, 9 మోసాలు, 9 భారాలు అని చెపారు.

మూడు ముక్క‌లాట ముఖ్య‌మంత్రి గురించి చెప్పడానికి ఇంతకు మించి ఏమి లేదని ఆయన అన్నారు. ఇసుక ధర, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ ధరలు ఆఖరికి మా అక్కా,చెల్లెలు సీరియళ్లు చూడటం కూడా తుగ్లక్ కి ఇష్టం లేదు అందుకే కేబుల్ బిల్లు కూడా పెంచేసాడు అంటూ తీవ్రంగా విమర్శించారు. మద్యపాన నిషేధం అని చెప్పి జగనన్న మద్యం దుకాణాలు ఓపెన్ చేసారు.

అసలు దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఇడుపుల పాయ ఎస్టేట్ లో తయారు అవుతున్నాయి. అవి కల్తీ సారా కంటే ప్రమాదం. అవి తాగితే ఆరు నెలల్లో పోవడం ఖాయం. అక్కా, చెల్లి పేరు చెప్పి మద్యపాన నిషేధం అంటూ చెత్త బ్రాండ్లు అమ్మి నెలకు 300 కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని లోకేష్ అన్నారు.

Related posts

మంత్రి రోజాపై అసమ్మతి రెచ్చగొడుతున్న ‘‘పెద్ద నాయకులు’’

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ

Satyam NEWS

కేసీఆర్ హాలియా బహిరంగసభను రద్దు చేయండి

Satyam NEWS

Leave a Comment