29.7 C
Hyderabad
May 3, 2024 04: 10 AM
Slider

ఉహాన్‌ కరోనా:వైద్య చికిత్సకై 450 మంది సైనిక డాక్టర్లు

china karona uhaan to treat virus 450 militry doctors

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ విదేశాలకు సైతం విస్తరిస్తు భయబ్రాంతులకు గురిచేస్తుంది.వైరస్‌ ప్రారంభమైన చైనాలోని ఉహాన్‌ నగరంలో వైద్య చికిత్సకోసం అదనంగా 450 మంది సైనిక డాక్టర్లను నియమించారు. చంద్రయాన్‌ నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించుకునేందుకు కూడా ఈ మహమ్మారి అడ్డుపడింది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.వైరస్‌ విస్తరించకుండా అదుపు చేసేందుకుగాను 18 నగరాలను దిగ్బంధం చేశారు.

కోట్లాదిమంది ప్రజలు ఎక్కడికీ వెళ్లడానికి వీలులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.ఇంత వరకు 41 మంది చనిపోగా 1287మందికి వైరస్‌ సోకినట్లు ధృవీకరించారు. శుక్రవారం 830 ధృవీకరణ కేసులు నమోదు కాగా అవి 24 గంటల్లోనే 1287కు పెరిగాయి. ఎక్కువ మృతులు హుబేరు రాష్ట్రంలోనే సంభవించాయి. పెరుగుతున్న వైరస్‌ కేసులను పరిశీలించి చికిత్స చేసేందుకు కొత్తగా వేయిపడకల ఆసుపత్రిని ఉహాన్‌ నగర శివార్లలో నిర్మిస్తున్నారు.

Related posts

అన్నెం శిరీష కు సేవా నందిని అవార్డు

Satyam NEWS

నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం

Satyam NEWS

సంక్రాంతికి ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment