29.7 C
Hyderabad
May 2, 2024 06: 58 AM
Slider ప్రపంచం

భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిన చైనా

#MikePompeo

ఇండో పసిఫిక్, దక్షిణ చైనా సముద్రం, తూర్పు లద్దాక్ ప్రాంతాలలో సైన్యాన్ని మోహరిస్తున్న చైనా సంబంధిత దేశాలలో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ సహాయ కార్యదర్శి మైక్ పాపియో ఆరోపించారు.

అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా దేశాల గ్రూప్ అయిన క్వాడ్ గ్రూప్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తి అనంతర పరిణామాలలో ఈ నాలుగు దేశాలు తొలి సారిగా వాషింగ్టన్ లో సమావేశం అయ్యాయి.

ఈ సమావేశంలో సంబంధిత దేశాల విదేశాగ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా సైనిక విన్యాసాలు సంబంధిత దేశాలలో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు.

భారత్ కు చెందిన తూర్పు సరిహద్దు ప్రాంతంలోకి చైనా 60 వేల మంది సైన్యాన్ని తరలించిందని మైక్ పాపియో అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన ఈ నాలుగు దేశాలు ప్రపంచ శాంతి కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, అదే విధంగా చైనా అనుసరిస్తున్న వ్యూహాలను ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఇటీవలె భారత విదేశాగ మంత్రి జయశంకర్ తో టోక్యోలో తాము జరిపిన సమావేశం ఫలవంతమైందని ఆయన వెల్లడించారు.

Related posts

బెయిల్ పై ఉన్న ఈ సీఎం అందరిని జైలుకు పంపాలని చూస్తున్నాడు

Satyam NEWS

వైసీపీ నేత హత్యతో సింగరాయకొండ ఉద్రిక్తం

Satyam NEWS

మళ్లీ విడుదల అయిన పగ సాధిస్తా సినిమా

Satyam NEWS

Leave a Comment