28.7 C
Hyderabad
May 5, 2024 09: 28 AM
Slider కృష్ణ

విభజన కన్నా ఎక్కువ విధ్వంసం చేసిన జగన్ పాలన

#chandrababu

ఇంతటి అవినీతిపరుడు, నేరచరితుడు, అసమర్థుడైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశామా? ప్రజలకు సేవచేసే క్రైస్తవుల్ని, వారి సంస్థల్ని ఆస్తుల్ని కూడా ఈ ప్రభుత్వం వదలడంలేదు. జగన్ కు భయపడి చాలామంది క్రైస్తవులు వారిఆస్తులు, సంస్థల్ని అతనికి సరెండర్ చేశారు. టీడీపీప్రభుత్వం నిర్మించిన, పవిత్రమైన క్రిస్టియన్ భవన్ ని జగన్ క్వారంటైన్ కేంద్రంగా మార్చాడు అంటూ టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. గుడివాడలో పాస్టర్ల సమావేశం లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకోబట్టే జగన్ దేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ సంపద రోజురోజుకీ పెరుగుతుంటే, అతనికి ఓట్లేసిన ప్రజలు మాత్రం కడుదుర్భరస్థితి అనుభవిస్తున్నారు. టీడీపీప్రభుత్వంలో క్రైస్తవులకు అమలుచేసిన అన్ని పథకాల్నిజగన్ రద్దుచేశాడు. సేవకు మారుపేరైన క్రైస్తవ మతపెద్దలు, చర్చిలే వేదికలుగా పేదరికనిర్మూలన కోసం టీడీపీప్ర భుత్వంతో కలిసి పనిచేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. మీరు మాకు కావాలి. తొందపాటువల్ల మేం మిమ్మల్ని పోగోట్టుకోవడంతోపాటు, కొన్ని కోల్పోయాము.

మాతప్పు మేం తెలుసుకొని మాకు ఏంకావాలో చెప్పుకోవడానికి మీవద్దకు వచ్చాము. క్రైస్తవుల్ని ఎస్సీల్లో చేర్చాలి, మతమార్పిడి పేరుతో మమ్మల్ని హింసిస్తున్నారు అంటూ పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవసోదరులకు ఇంతకుముందు ఏంచేశామో, భవిష్యత్ లో ఇంకా మెరుగ్గా వారికి ఏంచేస్తామో మాట్లాడుకోవడానికే మనం ఇక్కడ సమావేశమయ్యాం. చర్చిల మర మ్మతులకు టీడీపీప్రభుత్వం మాత్రమే డబ్బులిచ్చింది. గుంటూరులో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి టీడీపీప్రభుత్వం రూ.16కోట్లనిధులిచ్చి, 2ఎకరాల భూమిఇచ్చింది.

80 శాతం వరకు పనులుకూడా పూర్తిచేసింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక దాని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఆఖరికి పవిత్రమైన క్రిస్టియన్ భవన్ ని జగన్ క్వారంటైన్ కేంద్రంగా మార్చారు.  బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు, నిర్మాణానికి కూ డా టీడీపీప్రభుత్వం నిధులిచ్చింది. క్రైస్తవ ఆడబిడ్డలకు పెళ్లికానుక కింద రూ.50వేల ఆర్థికసహాయం అందించాము.

జెరూసలేం వెళ్లడానికి రూ.75వేల ఆర్థికసహాయం చే సింది టీడీపీప్రభుత్వమే. క్రిస్మస్ కానుక  ఇచ్చి పేదక్రైస్తవులు సంతోషంగా క్రిస్మస్ పం డుగ చేసుకునేలా చేశాం. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, దానిద్వారా పేద క్రైస్తవులను ఆదుకున్నాం. టీడీపీప్రభుత్వం క్రైస్తవులకోసం అమలుచేసినవి ఏవీ ఈ ప్రభుత్వంలో లేవు అని ఆయన అన్నారు. క్రైస్తవ సేవాసంస్థలు, విద్యాసంస్థలు, మతకేంద్రాలు అన్నీపలునగరాలు, పట్టణాల్లో ప్రధానకూడళ్లలో ఉండటంతో ఈప్రభుత్వం వాటిపై కన్నేసింది. వాటితాలూకా భూము లు, ఆస్తుల్ని కబ్జాచేస్తోంది.

టీడీపీప్రభుత్వం రాగానే వాటిని తిరిగి, ఆయాసంస్థలకు అప్పగిస్తుంది. టీడీపీప్రభుత్వంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలపై దాడులు జరిగితే తీవ్రంగా పరిగణించాం. అన్నిమతాలను సమానంగా గౌరవించాం. తాడేపల్లిలో ఒకచర్చిమీద దాడిజరిగితే నేనే స్వయంగా హెలికాఫ్టర్లో అక్కడికి వెళ్లి పరిశీలించి, నిందితుల్ని కఠినంగా శిక్షించేలా చేశాను అని ఆయన అన్నారు. క్రైస్తవసోదరులు ఎదుర్కొంటున్న సమస్యల్ని నాదృష్టికి తీసుకొచ్చారు.

టీడీపీప్రభు త్వం రాగానే వాటినిపరిష్కరిస్తుంది. క్రైస్తవుల్లో చాలామందిపేదలు ఉన్నారు. అలాంటి పేదలకు అండగా ఉండటమే టీడీపీలక్ష్యం.  ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారిలో కలిసి పోయేది పాస్టర్లే. వారుకూడా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసిరావాలి. సేవల విషయంలో ముందుండే క్రైస్తవమతపెద్దలు, పేదరికనిర్మూలనలో కూడా ముందుంటే, వారికి టీడీపీప్రభుత్వం అండగా ఉంటుంది అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచాడు. దేశంలోని అంద రి ముఖ్యమంత్రులవద్ద ఉన్న సంపదకంటే, జగన్ సంపదే ఎక్కువ. ఈయన  ఆదా యం రూ.510కోట్లు అయితే, దేశంలోని మిగతా ముఖ్యమంత్రులందరి ఆదాయం మాత్రం రూ.465కోట్లు. తాను రోజురోజుకీ ధనికుడు అవుతుంటే, ఓట్లేసిన ప్రజలు మాత్రం కడుదుర్భరస్థితిలో పేదరికంలో మగ్గిపోతున్నారు. జగన్ కు అంతడబ్బు ఎక్కడినుంచి వచ్చింది. దోచుకుంటేనే వచ్చింది అని చంద్రబాబు అన్నారు.

 విభజనవల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంకంటే, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయ డం వల్లే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. ఇలాంటి అవినీతిపరుడు, నేరచరిత్ర ఉన్న వాడు, అసమర్థుడైన ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు. పాస్టర్లు ఎలాగైతే స్వ చ్ఛందంగా సేవాభావంతో పనిచేస్తున్నారో, అదేభావనతో మూర్తిగారు విశాఖపట్నంలో గీతం విద్యాసంస్థల్నిస్థాపించారు. దేశంమెచ్చిన గీతం విద్యాసంస్థలపై జగన్ విద్వేషం తో దాడులు చేస్తున్నాడు. రాత్రికిరాత్రి జేసీబీలు పంపి, భవనాల్ని నేలమట్టం చేయిస్తు న్నాడు. ఇదేనా చేయాల్సింది? అని ఆయన ప్రశ్నించారు.

Related posts

ఓ గాడ్: ఓఆర్ఆర్ పై ప్రమాదంలో ఆరుగురు మృతి

Satyam NEWS

ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి: వనపర్తి జిల్లా కలెక్టర్

Satyam NEWS

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Satyam NEWS

Leave a Comment