32.2 C
Hyderabad
May 9, 2024 19: 37 PM
Slider నెల్లూరు

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న మాజీ మంత్రి నారాయ‌ణ‌

#pongurunarayana

సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవనశైలిని, బోధనలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అన్నారు. నెల్లూరు సంత‌పేట‌లోని సెయింట్‌జోసెప్ చ‌ర్చిని క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఆదివారం అర్థ‌రాత్రి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి సంద‌ర్శించారు. వారికి చ‌ర్చి ఫాస్ట‌ర్లు, నిర్వాహ‌కులు, టీడీపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం చ‌ర్చిలో నారాయ‌ణ, రమాదేవి దంపతులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. బిషప్ చెప్పిన దైవ‌సందేశాన్ని ఆల‌కించారు. ఈ క్ర‌మంలో ఫాదర్లు వారిని ఆశీర్వ‌దించారు. ప్ర‌జ‌లంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లను నారాయణ, రమాదేవి దంపతులు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ మాట్లాడుతూ యేసుప్ర‌భు అనుస‌రించిన‌ శాంతియుత జీవనం, శత్రువునైనా క్షమించే గుణం అందరికి అవసరమన్నారు. మానవాళికి జీసస్ తమ జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలను ప్ర‌తి ఒక్క‌రు పాటించాలని సూచించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికప్పుడు మనుషులందరిని సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు.ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి, 51వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ ప్రశాంత్ కుమార్,అధ్యక్షుడు కమతం ప్రేమ్ ప్రశాంత్,కమతం పవన్ కుమార్,ఆరవ కిషోర్,కువ్వరపు బాలాజీ,జహీర్, మైకేల్,భాస్కర్ రావు,ప్రదీప్.. సందేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రన్ రాజా రన్: ముందుగా మూడింది ఉప శాఖలకు

Satyam NEWS

వివాదం ఉన్న స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు

Satyam NEWS

వివేకా మర్డర్: అత్యంత ప్రముఖుడిని ప్రశ్నించిన సీబీఐ?

Satyam NEWS

Leave a Comment