40.2 C
Hyderabad
May 1, 2024 17: 36 PM
Slider మెదక్

స్వచ్ఛ కార్మికులకు ప్రభుత్వ వేతనాలు ఇవ్వాలి:CITU

#CITU Dubbaka

స్వచ్ఛ కార్మికులకు (స్కావెంజర్స్) ప్రవేట్ టీచర్ల మాదిరిగా ప్రభుత్వ వేతనాలు ఇవ్వాలని CITU ఆధ్వర్యంలో దుబ్బాక లో ధర్నా నిర్వహించారు. దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు MRO కార్యాలయం ముందు ధర్నా చేసి MROకి వినతిపత్రం ఇచ్చారు.

అనంతరం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ కరోనా కాలంలో కూడా పాఠశాలలో పని చేస్తున్నమధ్యాహ్న భోజన కార్మికులు, కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి సహకారాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రైవేట్ టీచర్ల మాదిరిగా వీరికి కూడ వేతనాలు పాఠశాలలు ప్రారంభించే వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ కూడా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, మధ్యాహ్న భోజన కార్మికులకు 1000 రూపాయలు, స్వచ్ఛ కార్మికులకు 1500 రూపాయలు మాత్రమే వేతనం చెల్లించడంతో వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాయని అన్నారు.

కరోనా సందర్భంగా పాఠశాలలు మూసివేయడంతో వారికి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వీరి కుటుంబాలకు కూడా వెంటనే నెలకు 7500 రూపాయలు ఆరు నెలల వరకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

ఆరు నెలల వరకు నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించి మధ్యాహ్న భోజన కార్మికులను స్వచ్ఛ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఎల్లo,చెంద్రం,రంగయ్య, రమేష్, భారతి,లక్ష్మీ బాయి,కవిత, లక్ష్మీ, చెంద్రకల, మంజుల,శిరేఖ, కనకవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజంపేట జిల్లా సాధన కోసం రాజీనామా లు చేస్తామన్న వైసీపీ నేతలు

Satyam NEWS

తిరుమ‌ల అంజ‌నాద్రి ఆంజ‌నేయస్వామి జ‌న్మ‌స్థ‌లం

Satyam NEWS

ఆటోలు తిప్పేవారిపై కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment